Prabhas look reveal date fix from Kannappa Movie
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కున్న మూవీ కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మధుబాల.. ఇలా ఎంతో మంది స్టార్ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి దాదాపుగా అందరి ఫస్ట్ లుక్ పోస్టర్లు వచ్చేశాయి.
మంచు విష్ణు, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ ఇలా అందరి పాత్రల పోస్టర్స్ రిలీజ్ చేశారు. అక్షర్ కుమార్ ఈ చిత్రంలో శివుడిగా కనిపించనున్నారు. ఇటీవలే ఆయన లుక్‌ను రివీల్ చేయగా అదిరిపోయే స్పందన వచ్చింది. ఇక ప్రభాస్ ఈ చిత్రంలో ఏ పాత్రలో నటిస్తున్నారు అన్న విషయంపై స్పష్టత రాలేదు. తొలుత శివుడి పాత్రలో అంటూ వార్తలు వచ్చాయి. ఆ పాత్రలో అక్షయ్ నటిస్తున్నట్లు తేలిపోయింది.
Here’s a glimpse of the Darling-Rebel Star ‘𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬’ in #Kannappa!🌟 🎬Experience the beginning of an epic journey, and don’t miss the full reveal on 3rd February. Stay tuned for more updates! 🙌 #Prabhas #HarHarMahadevॐ@themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas… pic.twitter.com/ujJMFf93W8
— Kannappa The Movie (@kannappamovie) January 27, 2025
ప్రభాస్ పాత్రకు సంబంధించిన లుక్‌ను ఎప్పుడు రివీల్ చేస్తారో అనే ఆసక్తి అందరిలో ఉంది. తాజాగా దీనిపై చిత్ర బృందం అప్‌డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి 3 న రెబల్ స్టార్ ప్రభాస్ లుక్‌ను విడుదల చేస్తామని ఓ పోస్టర్ ద్వారా చెప్పింది. ఈ పోస్టర్‌లో త్రిషూలం వెనుక ప్రభాస్ కన్నులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆయన నుదిటిపై ఉన్న బొట్టు మండుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. దీంతో ప్రభాస్ లుక్ కోసం వెయిటింగ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ లేటెస్ట్ వాచ్ ధర ఎన్ని లక్షల్లో తెలుసా.. ప్రపంచంలో ఇలాంటివి కేవలం..
అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న్యూజిలాండ్‌లోని అడవుల్లోనే ఈ చిత్రాన్ని దాదాపుగా చిత్రీకరించారు. కొంత భాగం రామోజీ ఫిలిం స్టూడియోలో సెట్ వేసి చేశారు. కాగా.. ఈ చిత్రానికి దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టారని వినిపిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఈ సినిమా.