Pushpa 2 Reloaded Version : పుష్ప 2 మళ్ళీ వాయిదా.. సంక్రాంతి సినిమాల కోసం తగ్గిన అల్లు అర్జున్..

దంగల్ రికార్డ్ కూడా బద్దలు కొట్టాలని పుష్ప 2 సినిమాకు 20 నిమిషాల ఫుటేజ్ జతచేసి జనవరి 11న మళ్ళీ రీ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

Allu Arjun Pushpa 2 Reloaded Version Postponed from Sankranthi

Pushpa 2 Reloaded Version : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఇప్పటికే నెల రోజుల్లో 1831 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాహుబలి రికార్డులు కూడా బద్దలు కొట్టింది. నార్త్ లో అయితే ఇంకా థియేటర్స్ లో అదరగొడుతుంది పుష్ప 2 సినిమా. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేసారు. అయితే ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా అమీర్ ఖాన్ దంగల్ నిలిచింది. ఆ తర్వాత మొన్నటిదాకా బాహుబలి 2 ఉండగా ఇప్పుడు పుష్ప 2 రెండో ప్లేస్ లో ఉంది.

Also Read : Sreemukhi : నేను కూడా హిందువునే.. పొరపాటు జరిగింది.. క్షమించండి.. శ్రీముఖి వీడియో వైరల్..

దీంతో దంగల్ రికార్డ్ కూడా బద్దలు కొట్టాలని పుష్ప 2 సినిమాకు 20 నిమిషాల ఫుటేజ్ జతచేసి జనవరి 11న మళ్ళీ రీ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. దంగల్ రికార్డులు కొడతామని ఫిక్స్ అయ్యారు. కానీ పలువురు మాత్రం సంక్రాంతి సినిమాలు వస్తుంటే మళ్ళీ పుష్ప 2 రిలీజ్ అవసరమా అని విమర్శలు కూడా చేసారు. అలాగే మూడు గంటల సినిమా నిడివి తగ్గించాల్సింది పోయి మళ్ళీ ఇంకో 20 నిముషాలు జతచేయడం అవసరమా అని కూడా విమర్శలు వచ్చాయి.

సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ జనవరి 10న, బాలకృష్ణ డాకు మహారాజ్ జనవరి 12న, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న రానున్నాయి. ఇప్పటికే అన్ని థియేటర్స్ లో ఈ మూడు సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీ అయి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. సంక్రాంతి సినిమాలకు సడెన్ గా పుష్ప 2 షాక్ ఇచ్చిందని టాలీవుడ్ లో టాక్ నడిచింది. అయితే పుష్ప 2 మూవీ యూనిట్ వెనక్కు తగ్గి సంక్రాంతికి సీన్స్ జతచేసి రీ రిలీజ్ చెయ్యట్లేదు అని ప్రకటించింది.

పలు సాంకేతిక కారణాల వల్ల పుష్ప 2 రీ లోడెడ్ వర్షన్ వాయిదా వేస్తున్నాము. జనవరి 11 రిలీజ్ చేయాలనుకున్నాము కానీ జనవరి 17 రిలీజ్ చేస్తాము అని ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే సంక్రాంతి సినిమాల కోసమే పుష్ప 2 నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా పుష్ప 2 రీ లోడెడ్ వర్షన్ సంక్రాంతి తర్వాత రిలీజ్ కానుంది. అప్పుడు అయినా 2000 కోట్లతో దంగల్ రికార్డ్ బద్దలు కొట్టాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Also Read : Racharikam Trailer : ఆర్జీవీ భామ అప్సరా రాణి ‘రాచరికం’ ట్రైలర్ రిలీజ్.. అరాచకంగా ఉందిగా..