Pushpa 2 Review : ‘పుష్ప 2’ మూవీ రివ్యూ.. వైల్డ్‌ఫైర్ ఎంటర్‌టైనర్.. అవార్డులన్నీ అల్లు అర్జున్‌కే.. సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ రివ్యూ!

Pushpa 2 Movie Review : 'పుష్ప 2 ది రూల్' మూవీపై సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ తన రివ్యూను ఇచ్చారు. వైల్డ్‌ఫైర్ ఎంటర్‌టైనర్.. అవార్డులన్నీ అల్లు అర్జున్‌కే దక్కుతాయి.

Pushpa 2 Review : ‘పుష్ప 2’ మూవీ రివ్యూ.. వైల్డ్‌ఫైర్ ఎంటర్‌టైనర్.. అవార్డులన్నీ అల్లు అర్జున్‌కే.. సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ రివ్యూ!

Allu Arjun Pushpa 2 Review by Movie critic Taran Adarsh

Updated On : December 5, 2024 / 1:23 AM IST

Pushpa 2 Movie Review : అల్లు అర్జున్ అభిమానుల నిరీక్షణ ముగిసింది. మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ థియేటర్లలోకి వచ్చింది. కొన్ని చోట్ల బుధవారం రాత్రి (డిసెంబర్ 4) నుంచే ‘పుష్ప 2 ది రూల్’ ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. ప్రీమియర్లతో పుష్ప 2 మూవీ థియేటర్ల వద్ద సందడి చేస్తోంది. కొన్ని చోట్ల గురువారం (డిసెంబర్ 5) తెల్లవారుజామున 4 గంటల నుంచి ‘పుష్ప 2 ది రూల్’ షోలు ప్రారంభం కానున్నాయి.

బన్నీ అభిమానులే కాదు.. సగటు సినీ ప్రేక్షకుడు నుంచి మూవీ లవర్స్ అందరూ పుష్ప 2ని ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప 2 మూవీ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ట్విట్టర్‌ (X)లో ఇప్పటికే పుష్ప 2 ది రూల్ ట్రెండ్ అవుతోంది. నేషనల్ వైడ్‌గా పుష్ప 2 గురించే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ పుష్ప 2 మూవీ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ఈ పుష్ప 2 మూవీరీ రివ్యూ అండ్ రేటింగ్ కూడా ఇచ్చేశారు.

పుష్ఫ 2 మూవీ మెగా బ్లాక్ బస్టర్ : 
ఈ చిత్రాన్ని ఒక్క మాటలో మెగా బ్లాక్ బస్టర్ అని తరణ్ ఆదర్శ్ అభివర్ణించారు. ఆయన ‘పుష్ప 2 ది రూల్’కి 4.5 రేటింగ్ ఇచ్చారు. తరణ్ ఆదర్శ్ తన రివ్యూలో ఏమని ఇచ్చారంటే.. ‘వైల్డ్‌ఫైర్ ఎంటర్‌టైనర్.. సినిమా ప్రతి సీన్‌లోనూ సరదాగా ఎంతో అద్భుతంగా ఉంటుంది.. అవార్డులన్నీ అల్లు అర్జున్‌కే దక్కుతాయి. బన్నీ అద్భుతమైన నటనను కనబరిచాడు. క్రూరమైన పోలీస్ ఆఫీసర్‌గా ఫహద్ ఫాసిల్ అద్భుతంగా కనిపించాడు.

మూవీలో వీరిద్దరి అద్భుతమైన ప్రతిభ… ఆద్యంతం ఆకట్టకుంటుంది. సినిమా ఫోకస్ అంతా అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్‌పైనే ఉంది. అయితే, ఇప్పటికీ రష్మిక మందన్న తన నటనతో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ మూవీకి దర్శకుడు సుకుమార్ జాదూగర్… బాక్సాఫీస్ తుపాను వచ్చేసింది. చివరి మాటలు.. మరిచిపోలేనిది.’ #సుకుమార్ మాంత్రికుడు… #బాక్సాఫీస్ టైఫూన్ వచ్చేసిందంటూ తరణ్ ఆదర్శ్ తన రివ్యూలో రాసుకొచ్చారు.

‘పుష్ప2 భారీ అంచనాల బరువును మోస్తుందని సుకుమార్‌కు బాగా తెలుసు. మూవీలో ప్రతి సన్నీవేశంలో ఊహించని మలుపులతో నిండిన కథనాన్ని అందించడంలో మాంత్రికుడు సుకుమార్ సక్సెస్ అయ్యాడు. పుష్ప 2 మూవీ అందరి అంచనాలకు తగినట్టుగా ఉంటుందని’ అని చెప్పుకొచ్చారు.

మరో ప్లస్ ఏమిటంటే.. హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, కొరియోగ్రాఫ్‌ అదిరిపోయిందన్నారు. అదనంగా, డైలాగ్‌లు, ఫస్ట్ హాఫ్ మాదిరిగా అద్భుతంగా సన్నివేశాలు ఉన్నాయి. సినిమా రన్‌టైమ్ 3 గంటలు, 20 నిమిషాలుగా ఉంది. మూవీ నిడివి అధికంగా ఉందా? స్టోరీ కోసం కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉండవచ్చా? అంటే.. కచ్చితంగా కాదు.

ఎడిటర్ #నవీన్ నూలి ఎడిటింగ్ వాటర్‌టైట్‌గా ఉంది. ఎక్కడా రెస్ట్ లేకుండా మూవీని అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే.. #Pushpa2 మూవీ మొదట్లో సాంగ్స్ వింటే.. మిమ్మల్ని ఆకర్షించే సౌండ్‌ట్రాక్‌ను కలిగి ఉండకపోవచ్చు. #DSP కంపోజిషన్‌ మ్యాజిక్ స్టోరీకి తగినట్టుగా పూర్తిస్థాయిలో తెరపై కనిపిస్తాయి.

#పుష్ప2 మూవీ #భారత్‌లో అత్యుత్తమ నటులలో ఒకరిగా #అల్లుఅర్జున్ స్థాయిని సుస్థిరం చేసింది. అతని ట్రేడ్‌మార్క్ నిష్కళంకమైన డైలాగ్ డెలివరీ బన్నీ నటనకు మరింత హైపును తీసుకొచ్చింది.
#ఫహద్ ఫాసిల్ కూడా క్రూరమైన పోలీసు అధికారిగా అద్భుతంగా నటించాడు. హీరోయిన్, నేషనల్ క్రష్ #రష్మికమందన్న కూడా ఇద్దరు మేల్ లీడ్స్‌పై దృష్టి సారించినప్పటికీ.. కీలక సమయాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. చివరి మాటగా.. పుష్ప 2 మూవీ మిస్సబుల్ అంటూ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ తన రివ్యూను ముగించారు.

 

View this post on Instagram

 

A post shared by Taran Adarsh (@taranadarsh)

మరోవైపు.. పుష్ప2పై అభిమానుల్లో భారీ క్రేజ్ నెలకొంది. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పుష్ప 2 మూవీ అర్ధరాత్రి షోలు వేశారు. హాలు బయట అభిమానులు గుమిగూడారు. జనాన్ని అదుపు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు లాఠీచార్జి చేశారు. సంధ్య థియేటర్‌లో బన్నీ కుటుంబ సమేతంగా అభిమానుల మధ్య పుష్ప 2 మూవీని చూసి ఎంజాయ్ చేశారు.

Read Also : Pushpa 2 Movie : ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద హైటెన్షన్..