Pushpa 2 Collections : మూడు రోజుల్లో పుష్ప 2 ప్రభంజనం.. ఎన్ని వందల కోట్లు వచ్చాయో తెలుసా? పుష్ప రాజ్ తాండవం..

అన్ని ఏరియాలలో పుష్ప 2 కలెక్షన్స్ అదరగొడుతున్నాయి.

Allu Arjun Pushpa 2 Total Three Days Collections Full Details Here

Pushpa 2 Collections : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. రిలీజ్ కి ముందు ప్రీమియర్స్ నుంచే అదరగొడుతూ హిట్ టాక్ తో కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్ సృష్టిస్తుంది. అన్ని ఏరియాలలో పుష్ప 2 కలెక్షన్స్ అదరగొడుతున్నాయి. మొదటి రోజు పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 294 కోట్లు గ్రాస్ వసూలు చేసి అత్యధిక కలెక్షన్స్ మొదటి రోజు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా నిలిచింది.

Also Read : Kissik Song : దెబ్బలు పడతయిరో.. కిస్సిక్ అంటున్న బామ్మలు.. పుష్ప 2 సాంగ్ కి బామ్మల స్టెప్స్ చూశారా?

ఇక రెండో రోజు పుష్ప సినిమా ఆల్మోస్ట్ 155 కోట్లు కలెక్ట్ చేసి రెండు రోజుల్లో 449 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడో రోజు మధ్యాహ్నానికే 500 కోట్ల గ్రాస్ దాటేసిన పుష్ప మూడు రోజుల్లో ఏకంగా 621 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఏ ఇండియన్ సినిమా కూడా మూడు రోజుల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేయలేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్, మూవీ యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నేడు ఆదివారం కావడం, నార్త్ లో ఎక్స్ ట్రా షోలు అడిగి మరీ వేస్తుండటంతో రేపటికి నాలుగు రోజుల్లో పుష్ప సినిమా ఈజీగా 800 కోట్లు గ్రాస్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. నార్త్, ఓవర్సీస్ లో పుష్ప 2 కలెక్షన్స్ ఊహించిన దానికంటే వస్తున్నాయి. దీంతో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ 1200 కోట్లు ఈజీగానే అయిపోతుందని తెలుస్తుంది. ఓవరాల్ గా 1500 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.