Allu Arjun : బాలీవుడ్‌లో సినిమాలపై స్పందించిన బన్నీ.. చేస్తారా?

అవార్డు వచ్చిన అనంతరం మొదటిసారి అల్లు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ అవార్డుతో పాటు పలు అంశాల గురించి, సినిమాల గురించి కూడా మాట్లాడారు.

Allu Arjun : బాలీవుడ్‌లో సినిమాలపై స్పందించిన బన్నీ.. చేస్తారా?

Allu Arjun reacts on Bollywood Movie first press meet after getting National Award

Updated On : August 27, 2023 / 11:33 AM IST

Allu Arjun : ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో(National Film Awards) తెలుగు సినిమా సత్తా చాటి దాదాపు 10 పురస్కారాలు గెలుచుకుంది. వీటిల్లో జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు సాధించాడు. తెలుగులో నేషనల్ బెస్ట్ యాక్టర్(Best Actor) అవార్డు అందుకున్న మొదటి హీరో కావడంతో గత మూడు రోజుల నుంచి బన్నీకి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

అవార్డు వచ్చిన అనంతరం మొదటిసారి అల్లు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ అవార్డుతో పాటు పలు అంశాల గురించి, సినిమాల గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం బన్నీ పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.

Allu Arjun : జాతీయ ఉత్తమ నటుడు అవార్డుపై మొదటిసారి స్పందించిన అల్లు అర్జున్.. చాలా విభాగాల్లో పుష్ప నామినేషన్లు.. కానీ..

బాలీవుడ్ సినిమాల్లో నటిస్తారా అనే దానిపై అల్లు అర్జున్ స్పందిస్తూ.. రాబోయే రోజుల్లో సినిమా రూపురేఖలు మరింత మారతాయి. ఇప్పటికే అని భాషల వాళ్ళు కలిసి సినిమాలు చేస్తున్నారు. ఇకపై భాషతో సంబంధం లేకుండా సినిమాలు వస్తాయి. బాలీవుడ్ లో భవిష్యత్తులో తప్పక సినిమాలు చేస్తాను. ప్రస్తుతం త్రివిక్రమ్, సందీప్ వంగ సినిమాలు ఉన్నాయి. అవి పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటాయి. ఇంకా సినిమాలు చేసుకుంటూ వెళ్తాను అని తెలిపారు.