Allu Arjun Shares a cute pic with his daughter Allu Arha
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తన కూతురు అర్హ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా బన్నీ తన కూతురితో దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో బన్నీ ఒడిలో అర్హ కూర్చుని ఉంది. అల్లు అర్హ అంటే డాడీ డాటర్ అనుకుంటివా.. డాడీ ప్రిన్సెస్ అంటూ బన్నీ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్‌లో తన పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ తో కలిసి బన్నీ సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుదల చేయగా వైరల్ అవుతోంది. వచ్చి రావడంతో ఇద్దరు చిన్నారులు బాలయ్య కాళ్లకు నమస్కారం చేశారు. ఇది పెద్దల పట్ల వారికున్న సంస్కారాన్ని సూచిస్తోంది.
Game Changer : గేమ్ ఛేంజర్ మూడో సాంగ్ అప్డేట్ ఇచ్చిన తమన్.. ఈసారి మెలోడీ..
బాలయ్య వీళ్లకు తెలుగు వచ్చా అని అడుగగా అర్హ.. తెలుగు పద్యాన్ని ఎంతో అలవోకగా చెప్పింది. పదవతరగతి తెలుగు సబ్జెక్టులో ఉండే పద్యం ‘అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ..’ని అర్హ ఇంత ఈజీగా స్పష్టంగా చెప్పేయడంతో అందరూ తనని మెచ్చుకున్నారు.
Rocking Rakesh : పాపం తన సినిమా పోస్టర్స్ తానే గోడ మీద అతికించుకుంటున్న జబర్దస్త్ రాకేష్..
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.