Allu Arjun : ‘యానిమల్’ సినిమాపై అల్లు అర్జున్.. ఇండియన్ క్లాసిక్ సినిమా అంటూ తెగ పొగడ్తలు..

పలువురు సినీ సెలబ్రిటీలు కూడా యానిమల్ సినిమాను పొగిడేస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తాజాగా యానిమల్ సినిమా చూసి అల్లు అర్జున్ తన రివ్యూని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Allu Arjun shares his Review about Ranbir Kapoor Animal Movie

Allu Arjun : సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక(Rashmika) జంటగా తెరకెక్కిన ‘యానిమల్’ సినిమా భారీ విజయం సాధించింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా యానిమల్(Animal) సినిమా పేరే వినిపిస్తుంది. ఆ రేంజ్ లో పెద్ద హిట్ అయింది ఈ సినిమా. ఓ పక్క ఫాదర్ ఎమోషన్ తో ఏడిపిస్తూనే మరో పక్క బోల్డ్ సీన్స్ తో, మాస్ యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టాడు సందీప్ వంగ. ఇప్పటికే యానిమల్ సినిమా వారం రోజుల్లోనే 563 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

యానిమల్ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కి మంచి పేరు వస్తోంది. రణబీర్ కెరీర్ లోనే అతి పెద్ద విజయం సాధించింది ఈ సినిమా. సినిమాలో నటించిన రష్మిక, త్రిప్తి, అనిల్ కపూర్, బాబయ్ డియోల్.. ఇలా అందరికి మంచి పేరు వచ్చింది. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు కూడా యానిమల్ సినిమాను పొగిడేస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తాజాగా యానిమల్ సినిమా చూసి అల్లు అర్జున్ తన రివ్యూని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అల్లు అర్జున్ తన ట్వీట్ లో.. యానిమల్ సినిమా అదిరిపోయింది. సినిమాటిక్ బ్రిలియన్స్ కనపడింది. ఈ చిత్రియునిట్ కి అభినందనలు. ఇండియన్ సినిమా పర్ఫార్మెన్స్ లను రణబీర్ కపూర్ ఒక కొత్త లెవెల్ కి తీసుకెళ్లాడు. నువ్ నీ పర్ఫార్మెన్స్ తో క్రియేట్ చేసిన మ్యాజిక్ గురించి మాట్లాడటానికి మాటలు కూడా లేవు. మీ మీద నా రెస్పెక్ట్ పెరిగింది. రష్మిక నువ్వు అదరగొట్టేసావు. ఇది నీ బెస్ట్ పర్ఫార్మెన్స్, ఇలాంటివి ఇంకా చాలా రావాలి. బాబీ డియోల్.. మీ పర్ఫార్మెన్స్ మాకు మాటలు లేకుండా చేసింది. అనిల్ కపూర్ గారు మీ అనుభవమే మాట్లాడింది. యంగ్ లేడీ త్రిప్తి దిమ్రి ఎంతో మంది హార్ట్స్ ని బ్రేక్ చేసింది, ఇంకా చేయాలి. అలాగే మిగిలిన ఆర్టిస్టులకు, టెక్నిషియన్స్ అందరికి అభినందనలు. చివరగా డైరెక్టర్ సందీప్ వంగ గారు సినిమాల్లో ఉన్న లిమిటేషన్స్ దాటేశారు. సినిమాలో ఉన్న ఇంటెన్స్ దేంతో పోల్చలేం. మీరు మా అందర్నీ గర్వపడేలా చేశారు. మీ సినిమాలు ఇండియన్ సినిమాని ఇప్పుడు, భవిష్యత్తులో ఎలా మారుస్తాయా నేను కచ్చితంగా చూస్తాను. యానిమల్ సినిమా ఇండియన్ క్లాసిక్ సినిమాల లిస్ట్ లో జాయిన్ అయింది అంటూ సినిమాపై, సినిమాలోని నటీనటులపై పొగడ్తలు కురిపించాడు.

Also Read : Varun Lavanya : వరుణ్ లావణ్య హనీమూన్‌కి ఎక్కడికి వెళ్లారో తెలుసా? అంత మంచులో ఎవరూ వెళ్లి ఉండరు ఇప్పటిదాకా..

ఇక యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సందీప్ – ప్రభాస్ సినిమా అయ్యాక వీరి కాంబోలో సినిమా ఉండబోతుందని సమాచారం.