Varun Lavanya : వరుణ్ లావణ్య హనీమూన్‌కి ఎక్కడికి వెళ్లారో తెలుసా? అంత మంచులో ఎవరూ వెళ్లి ఉండరు ఇప్పటిదాకా..

వరుణ్ లావణ్య అయిదు రోజుల క్రితం హనీమూన్ కి వెళ్లారు. అయితే ఎక్కడికి వెళ్లిందో చెప్పకపోయినా ట్రిప్ కి వెళ్తున్నట్టు ఎయిర్ పోర్ట్ లో సెల్ఫీ దిగి పోస్ట్ చేశారు. తాజాగా వరుణ్, లావణ్యలు తమ హనీమూన్ నుంచి ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు.

Varun Lavanya : వరుణ్ లావణ్య హనీమూన్‌కి ఎక్కడికి వెళ్లారో తెలుసా? అంత మంచులో ఎవరూ వెళ్లి ఉండరు ఇప్పటిదాకా..

Do You know where Varun Tej and Lavanya Tripathi went to Honeymoon Photos Goes Viral

Updated On : December 8, 2023 / 2:32 PM IST

Varun Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ఇటీవల లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ ఇద్దరూ రెండు కుటుంబాలని ఒప్పించి ఇటీవల నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలు, సన్నిహితుల మధ్యే వరుణ్ లావణ్య వివాహం జరిగింది. అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ రెసెప్షన్ కూడా ఎర్పాటు చేశారు.

పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య ఎక్కడికి వెళ్లినా, వారి ఫోటో బయటకి వచ్చినా వైరల్ అవుతున్నారు. వరుణ్ లావణ్య అయిదు రోజుల క్రితం హనీమూన్ కి వెళ్లారు. అయితే ఎక్కడికి వెళ్లిందో చెప్పకపోయినా ట్రిప్ కి వెళ్తున్నట్టు ఎయిర్ పోర్ట్ లో సెల్ఫీ దిగి పోస్ట్ చేశారు. తాజాగా వరుణ్, లావణ్యలు తమ హనీమూన్ నుంచి ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు.

వరుణ్ – లావణ్యలు హనీమూన్ కి అత్యంత చల్లని ప్రదేశంకి వెళ్లారు. ఫిన్లాండ్(Finland) దేశంలోని ల్యాప్ లాండ్ అనే ఏరియాకు వెళ్లారు. ఆల్మోస్ట్ ఆర్కిటిక్ కి దగ్గరగా ఉన్న ప్రదేశానికి వెళ్లారు. అక్కడ -10 డిగ్రీల చలిలో, మంచు కురుస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఇద్దరూ విడివిడిగా ఫోటోలు కూడా పోస్ట్ చేశారు. ఆర్కిటిక్ సర్కిల్(Arctic Circle) అని ఉన్న ఓ ఫోటోని కూడా వరుణ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ జంట హనీమూన్ చేసుకోవడానికి చల్లని మంచు ప్రదేశం ఫిన్లాండ్ వెళ్లినట్టు తెలుస్తుంది. మరి ఈ ట్రిప్ ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తారో? ఇంకెన్ని ఫోటోలు పోస్ట్ చేస్తారో చూడాలి.

Lavanya Tripathi

Also Read : Fighter Teaser : హృతిక్ రోషన్ ‘ఫైటర్’ టీజర్ రిలీజ్.. ఈసారి యుద్ధం ఆకాశంలో..

అయితే ఇప్పటివరకు ఆర్కిటిక్ దగ్గరికి మన సెలబ్రిటీలు ఎవ్వరూ ఇలా ఎంజాయ్ చేయడానికి వెళ్లినట్టు లేరు. దీంతో ఈ జంట మొదటిసారి హనీమూన్ కోసం అంతదూరం వెళ్లిందని ఆశ్చర్యపోతూ కామెంట్స్ వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)