Fighter Teaser : హృతిక్ రోషన్ ‘ఫైటర్’ టీజర్ రిలీజ్.. ఈసారి యుద్ధం ఆకాశంలో..

బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్, దీపికా పదుకొనె, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఫైటర్ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది.

Fighter Teaser : హృతిక్ రోషన్ ‘ఫైటర్’ టీజర్ రిలీజ్.. ఈసారి యుద్ధం ఆకాశంలో..

Hrithik Roshan Deepika Padukone Fighter movie Teaser released

Updated On : December 8, 2023 / 2:00 PM IST

Fighter Teaser : బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్.. వార్, పఠాన్ లాంటి యాక్షన్ సినిమాలతో ఆడియన్స్ ని థ్రిల్ చేసి సూపర్ సక్సెస్ లని అందుకున్నారు. ఇప్పుడు హృతిక్ రోషన్ తో మరోసారి కలిసి ‘ఫైటర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్, దీపికా పదుకొనె, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ ని మేకర్స్ నేడు రిలీజ్ చేశారు. వార్ సినిమా లాగానే ఈ మూవీలో కూడా ఓ రేంజ్ యాక్షన్ ఉండబోతుందని తెలుస్తుంది.

టీజర్ లోని విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాలో హృతిక్, దీపికా, అనిల్ కపూర్.. ఫైటర్ జెట్ పైలట్స్ గా కనిపించబోతున్నారు. టీజర్ లోనే యాక్షన్ ఇంటెన్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. ఇక థియేటర్స్ లో ఆడియన్స్ కి విజువల్ వండర్ కాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాని 2024 జనవరి 25న రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. వియాకామ్ 18 స్టూడియోస్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తుంది.

Also read : Yash 19 : యశ్ 19 టైటిల్ అనౌన్స్.. ‘టాక్సిక్’ అంటూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్..

ఇక హృతిక్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ తో కలిసి ‘వార్ 2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ ని కూడా మొదలు పెట్టారు. ప్రస్తుతం హృతిక్, ఎన్టీఆర్ లేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. హృతిక్ ఫైటర్ మూవీ రిలీజ్, ప్రమోషన్స్ పూర్తి అయిన తరువాత వార్ 2 సెట్స్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇక వార్ 2 చిత్రాన్ని 2025 ఆగష్టు 15న రిలీజ్ చేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేశారు. కాగా ఈ మూవీ YRF స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.