ఒకేసారి రెండు సినిమాలతో.. స్పీడ్ పెంచిన బన్ని

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల మీద సినిమాలు అనౌన్స్ చేస్తూ.. అభిమానుల్ని గందరగోళంలో పడేస్తున్నాడు. ఒక సినిమా మొదలుపెట్టక ముందే.. మరో సినిమాకి సైన్ చేస్తూ మరింత స్పీడ్ పెంచేస్తున్నాడు బన్నీ. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో బాగా ఆలోచనలో పడ్డాడు. దాంతో గ్యాప్ లేకుండా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బన్నీ సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ట్రీట్ ఇవ్వబోతున్నాడు.
బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూడో సినిమా అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8, 2019)న మొదలవ్వనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాని 2018 డిసెంబర్ 31న అనౌన్స్ చేశారు. అంటే మూడు నెలలు గడుస్తున్నా సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. అందుకే ఫ్యాన్స్ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
మూడు నెలల ముందు అనౌన్స్ చేసిన సినిమా ఇంకా సెట్స్ మీదికి వెళ్లకపోయినా బన్నీ మాత్రం సైలెంట్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకుంటున్నాడు. త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ కాగానే సుకుమార్ డైరెక్షన్ లో హ్యాట్రిక్ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. రంగస్థలం తర్వాత సుకుమార్ డైరెక్ట్ చేయబోయే సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. త్రివిక్రమ్, సుకుమార్ సినిమాలతో పాటు బన్నీ మరో డైరెక్టర్ తో కూడా సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
చాలా రోజుల నుంచి యంగ్ డైరెక్టర్స్ కి అవకాశం ఇచ్చేందుకు చూస్తోన్న బన్నీ MCA, ఓ మై ఫ్రెండ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా సుకుమార్ మూవీ తర్వాత పట్టాలెక్కనుంది. మొత్తానికి బన్నీ ప్రాజెక్ట్స్‌ని బాగానే సెట్ చేసుకుంటున్నాడు. మరి..ఈ సినిమాలతో ఎలాంటి సక్సస్ సాధిస్తాడో చూడాలి.