Allu Ayaan : అప్పుడే జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టిన అల్లు అయాన్..

అప్పుడే జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టిన అల్లు అయాన్. ఇక ఈ పోస్టులు చూసిన నెటిజెన్స్..

Allu Ayaan : అప్పుడే జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టిన అల్లు అయాన్..

Allu Arjun son Ayaan gym workout videos gone viral

Allu Ayaan : అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్.. ప్రస్తుతం తన తండ్రి కంటే ఎక్కువుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఈ అల్లు వారసుడు చేసే అల్లరికి నెటిజెన్స్ అంతా ఫిదా అయ్యారు. దీంతో మోడల్ అయాన్ అంటూ అల్లు వారసుడిని సోషల్ మీడియా సెలబ్రిటీని చేసేసారు. దీంతో ప్రస్తుతం అయాన్ కి సంబంధించిన ప్రతి విషయం నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా అల్లు స్నేహారెడ్డి అయాన్ కి సంబంధించిన కొన్ని వీడియోలు షేర్ చేశారు.

ఆ వీడియోలో అయాన్ జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ కనిపిస్తున్నాడు. ట్రైనర్ తో బాక్సింగ్ చేస్తూ, తన తల్లితో కలిసి భారీ టైర్ ని లిఫ్ట్ చేస్తూ.. ఇప్పటినుంచే కండలు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాదు, జెంటిల్‌మెన్ లా న్యూస్ పేపర్ కూడా చదువుతూ.. మెదడుకి కూడా సానపెడుతున్నాడు. ఇక ఈ పోస్టులు చూసిన నెటిజెన్స్.. మోడల్ అయాన్ కాదు హీరో అయాన్ అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

Also read : Sukrithi Ambati : తొమ్మిదేళ్ల తరువాత మళ్ళీ కనిపించిన నటి.. నూకరాజు కోసం భావన..

ఇక అల్లు అర్జున్ పుష్ప 2 విషయానికి వస్తే.. ఫస్ట్ పార్టుకి ఓ రేంజ్ క్రేజ్ రావడంతో సీక్వెల్ ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మూవీలోని ఎమోషన్స్ అండ్ యాక్షన్ సన్నివేశాలను మొదటి పార్టు కంటే అద్భుతంగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారట. ఈక్రమంలోనే సినిమాలోని జాతర సన్నివేశం కోసమే ఎక్కువ కోట్లు, రోజులు ఖర్చు పెడుతున్నారట.

కాగా ఈ చిత్రాన్ని మొత్తం మూడు భాగాలుగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల అల్లు అర్జున్ కూడా ఈ మూడో పార్ట్ గురించి హింట్ ఇస్తూ కామెంట్స్ చేశారు. పుష్ప ది రైజ్ అంటూ ఫస్ట్ పార్ట్‌ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన మేకర్స్.. పుష్ప ది రూల్ అంటూ సెకండ్ పార్ట్‌ని, పుష్ప రోర్ మూడో భాగంగా తీసుకు రానున్నారట.