Pushpa 2 Collections : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. సినిమాలోని యాక్షన్ సీన్స్, అల్లు అర్జున్ నటన, ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకులను మెప్పించారు. ఇక కలెక్షన్స్ విషయంలో మొదటిరోజు నుంచి పుష్ప 2 రికార్డులు సెట్ చేస్తుంది.
పుష్ప 2 సినిమా మొదటి రోజే 294 కోట్లు గ్రాస్ వసూలు చేసి మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన ఇండియన్ సినిమాగా నిలిచింది. మూడు రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ దాటింది. ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది పుష్ప 2 సినిమా. నార్త్ లో ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చాయి. గత నెల జనవరి 6నే పుష్ప 2 సినిమా బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేసింది అంటూ పుష్ప 2 సినిమా 32 రోజుల్లో 1831 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
పుష్ప 2 సినిమా అదే చివరిసారిగా కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేయడం. ఆ తర్వాత 50 రోజుల పోస్టర్ రిలీజ్ చేసినా కలెక్షన్స్ చెప్పలేదు. కొన్ని సీన్స్ యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేసారు పుష్ప 2 సినిమాని. అప్పుడు కూడా ఫ్యాన్స్ భారీగానే వచ్చి సినిమా చూసారు. అయితే మూవీ యూనిట్ కలెక్షన్స్ పోస్టర్స్ వేయకపోయినా పుష్ప 2 సినిమా 1900 కోట్లు కలెక్ట్ చేసిందని, 2000 కోట్లు కలెక్ట్ చేసిందని హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమా దంగల్ రికార్డ్ కూడా బ్రేక్ అయిందని ఫ్యాన్స్ పోస్టులు చేసారు.
ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్, నిర్మాతలు నవీన్, రవి శంకర్, డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై, ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మైత్రి మూవీ మేకర్స్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి పుష్ప 2 కలెక్షన్స్ విషయంలో 500 కోట్లు డిఫరెన్స్ చూపించారు అని ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దాంతో ఇంకేముంది పుష్ప 2 సినిమాకు 2300 కోట్లు వచ్చాయి అని ఫ్యాన్స్ సంబరపడిపోయారు.
అయితే ఉన్నట్టుండి ఇప్పుడు పుష్ప 2 మూవీ యూనిట్ కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. పుష్ప 2 సినిమా ఇప్పటి వరకు 1871 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అంటే గత నెల జనవరి 6 నుంచి ఇప్పటి వరకు పుష్ప 2 సినిమా కేవలం 40 కోట్లే కలెక్ట్ చేసిందా? ఇంకా 2000 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయలేదా? దంగల్ రికార్డ్ బద్దలు కొట్టలేదా అని ఆశ్చర్యపోతూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కొంతమంది ఫ్యాన్స్ అయితే ఇదే ఫేక్ ఆల్రెడీ 2000 కోట్లు దాటేసింది, 2000 కోట్ల పోస్టర్ రిలీజ్ చేయండి అని కూడా అంటున్నారు. మొత్తానికి పుష్ప 2 సక్సెస్, వివాదాలు తర్వాత మూవీ యూనిట్ తాపీగా ఇప్పుడు 1871 కోట్లతో ఫైనల్ కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఇండియన్ సినిమాల్లో అత్యధికంగా కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా దంగల్ రికార్డ్ సేఫ్ గానే ఉండగా సెకండ్ ప్లేస్ లో పుష్ప 2 నిలిచి బాహుబలి 2 మూడవ స్థానానికి వెళ్ళింది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.
Shattering many records and creating new records, #Pushpa2TheRule stands tall as INDIAN CINEMA'S INDUSTRY HIT ❤️🔥#Pushpa2TheRule grosses 1871 CRORES WORLDWIDE 💥💥
RECORDS RAPA RAPAA 🔥#Pushpa2#WildFirePushpa
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/zR6H9BQzrT— Pushpa (@PushpaMovie) February 18, 2025