Allu Arjun : మేనేజర్ పెళ్ళికి సడెన్‌గా వచ్చి సర్‌ప్రయిజ్ ఇచ్చిన అల్లు అర్జున్

 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన టీంతో చాలా క్లోజ్‌గా ఉంటారు. తన దగ్గర పని చేసే వాళ్ళని, తన టీం మెంబర్స్‌ని చాలా బాగా చూసుకుంటారు, అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు. గతంలో తన.........

Allu Arjun

Allu Arjun :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన టీంతో చాలా క్లోజ్‌గా ఉంటారు. తన దగ్గర పని చేసే వాళ్ళని, తన టీం మెంబర్స్‌ని చాలా బాగా చూసుకుంటారు, అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు. గతంలో తన దగ్గర పని చేసే మెంబర్స్‌కి గిఫ్టులు ఇవ్వడం, వాళ్ళకి తన సినిమాల్లో ఛాన్సులు ఇవ్వడం, వాళ్ళ ఇళ్లల్లో జరిగే వేడుకలకి వెళ్లడం చేశారు బన్నీ. తన పర్సనల్ టీం పట్ల మరింత కేరింగ్ చూపిస్తారు అల్లు అర్జున్.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై నారా లోకేష్ స్పెషల్ ట్వీట్..

తాజాగా అల్లు అర్జున్ తన మేనేజర్ మనీష్ వివాహ వేడుకకు హాజరయ్యారు. తన బిజీ షెడ్యూల్‌లో మేనేజర్ కోసం టైం కేటాయించి పెళ్ళికి వచ్చి కొత్త దంపతులని ఆశీర్వదించి వెళ్లారు. మనీష్ బన్నీని వివాహ వేడుకకి పిలిచినా తన బిజీ షెడ్యూల్ వల్ల రారేమో అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ సడెన్‌గా వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కొత్త దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు అల్లు అర్జున్‌తో ఫోటోలు దిగారు.