Allu Arjun Family : పుష్ప 2 సక్సెస్ తర్వాత ఫ్యామిలీతో అల్లు అర్జున్ సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి నేడు సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఫోటోలు షేర్ చేసింది.

Allu Arjun Wife Allu Sneha Reddy Shares Family Photos on Sankranthi
Allu Arjun Family : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా పెద్ద హిట్ అవ్వడం, సంధ్య థియటర్ ఘటన, అల్లు అర్జున్ జైలుకెళ్లి రావడం.. ఇలా వైరల్ అవుతూనే ఉన్నాడు బన్నీ. ప్రస్తుతం బన్నీ తన ఫ్యామిలీతో కొంత ప్రశాంత సమయం గడుపుతున్నాడు. తాజాగా నేడు ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్.
Also See : Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి స్పెషల్.. ట్రెడిషినల్ ఫోటోలు చూశారా?
అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి నేడు సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఫోటోలు షేర్ చేసింది. అల్లు అర్జున్, స్నేహ, పిల్లలు అర్హ, అయాన్ నలుగురు ట్రెడిషినల్ గా రెడీ అయి పండగ సందర్భంగా దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది స్నేహారెడ్డి. పిల్లలతో కలిసి క్యూట్ సెల్ఫీ కూడా తీసుకున్నారు బన్నీ. ఈ ఫోటోలు షేర్ చేసి స్నేహ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది.
అల్లు స్నేహారెడ్డి రెగ్యులర్ గా ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుందని తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఇలా బన్నీ ఫ్యామిలీతో ట్రెడిషినల్ గా కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సంక్రాంతి ఫ్యామిలీ ఫోటోలు వైరల్ గా మారాయి.
ఇక పుష్ప 2 సినిమా ఇప్పటికే 1850 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాహుబలి 2 రికార్డ్ కూడా బద్దలు కొట్టింది. ఇంకొన్ని సీన్స్ జత చేసి జనవరి 17న మళ్ళీ రీ రిలీజ్ చేయనున్నారు. దాంతో దంగల్ 2000 కోట్ల రికార్డ్ కూడా బద్దలు కొట్టాలని ప్లాన్ చేస్తుంది మూవీ యూనిట్.
Also Read : Ram Charan : గ్లోబల్ స్టార్ సంక్రాంతి స్పెషల్ ఫ్యామిలీ ఫొటో.. ఈసారి కూడా క్లిన్ కారా ఫేస్ చూపించలేదుగా..