Ram Charan : గ్లోబల్ స్టార్ సంక్రాంతి స్పెషల్ ఫ్యామిలీ ఫొటో.. ఈసారి కూడా క్లిన్ కారా ఫేస్ చూపించలేదుగా..

ఉపాసన ఓ స్పెషల్ ఫొటో షేర్ చేసింది.

Ram Charan : గ్లోబల్ స్టార్ సంక్రాంతి స్పెషల్ ఫ్యామిలీ ఫొటో.. ఈసారి కూడా క్లిన్ కారా ఫేస్ చూపించలేదుగా..

Upasana Shares Special Photo with Ram Charan and Klin Kaara on Sankrtanthi

Updated On : January 14, 2025 / 2:37 PM IST

Ram Charan : రామ్ చరణ్ ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాతో జనవరి 10న థియేటర్స్ లోకి వచ్చాడు. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ వచ్చినా సంక్రాంతి హాలీడేస్ కావడంతో థియేటర్స్ లో బాగానే నడుస్తుంది. ప్రతి సంవత్సరం మెగా ఫ్యామిలీలో అందరు హీరోలు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి స్పెషల్ గా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు. మెగా ఫ్యామిలీ సంక్రాంతి ఫోటోలు ప్రతి సంవత్సరం వైరల్ అవుతాయి.

Also Read : Ram Charan : నా హృద‌యంలో గేమ్ ఛేంజ‌ర్‌కు ప్ర‌త్యేక స్థానం.. శంక‌ర్ సార్‌కు రుణ‌ప‌డి ఉంటా : రామ్‌చ‌ర‌ణ్‌

కానీ ఈసారి మెగా ఫ్యామిలీ అంతా కలిసి సంక్రాంతి చేసుకుంటున్నట్టు అనిపించట్లేదు. ఆల్రెడీ నేడు సంక్రాంతి అయినా ఫ్యామిలీ అందరూ కలిసి ఒక్క ఫొటో కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ఉపాసన ఓ స్పెషల్ ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, వీరి కూతురు క్లిన్ కారా ఉన్నారు,. ప్రస్తుతం ఈ గ్లోబల్ స్టార్ ఫ్యామిలీ ఫొటో వైరల్ గా మారింది.

Upasana Shares Special Photo with Ram Charan and Klin Kaara on Sankrtanthi

అలాగే నిన్న ఇంట్లో భోగి మంటలు వేసిన చిన్న వీడియో షేర్ చేసింది. అయితే ఉపాసన షేర్ చేసిన ఫొటో నిన్న ఉదయం భోగి మంటలు వేసినప్పటి సెలెబ్రేషన్స్ ది అని తెలుస్తుంది. ఈ పోస్ట్ షేర్ చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది ఉపాసన.

అయితే ఈ ఫొటోలో కూడా క్లిన్ కార ఫేస్ చూపించలేదు. పాప పుట్టినప్పట్నుంచి ఫేస్ చూపించట్లేదు. ఫ్యాన్స్ రెగ్యులర్ గా క్లిన్ కారా ఫేస్ చూపించమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇటీవల బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో తను నాన్న అని పిలిచినా తర్వాత ఫేస్ చూపిస్తాను అని రామ్ చరణ్ తెలిపారు.

Also Read : Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఫ్లాప్ మూవీ రీరిలీజ్‌..