Ram Charan : నా హృదయంలో గేమ్ ఛేంజర్‌కు ప్రత్యేక స్థానం.. శంకర్ సార్‌కు రుణపడి ఉంటా : రామ్‌చరణ్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటించిన మూవీ గేమ్ ఛేంజర్.

A big thank you to Shankar Sir for the opportunity Ram Charan
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటించిన మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికి తొలి రోజే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
ఇక సంక్రాంతి సందర్భంగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు రామ్‌చరణ్. తనతో గేమ్ ఛేంజర్ చిత్రాన్ని తెరకెక్కించినందుకు దర్శకుడు శంకర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను పంచుకున్నారు.
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్లాప్ మూవీ రీరిలీజ్..
తన హృదయంలో గేమ్ ఛేంజర్ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉందన్నారు. 2025ని పాజిటివ్‌తో ప్రారంభించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అభిమానులు చూపించే ప్రేమకు రుణపడి ఉంటానని చెప్పాడు.
గేమ్ ఛేంజర్ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజలి, ఎస్‌జే సూర్య, సునీల్‌లు కీలక పాత్రలను పోషించారు.
View this post on Instagram