Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రొమో వచ్చేసింది.. పవన్ పాడిన పాటను విన్నారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి.

Pawan Kalyan Hari Hara Veera Mallu First Single promo Maatavinaali out now
Hari Hara Veera Mallu First Single promo : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి. దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి తొలి పాట మాట వినాలి ప్రొమోను విడుదల చేశారు.
పాటను విడుదల చేయకుండా.. ఈ పాటలో ‘వినాలి.. వీర మల్లు మాట చెబితే వినాలి.’ అని పవన్ చెప్పిన డైలాగ్‌ను విడుదల చేశారు. పూర్తి పాటను జనవరి 17న ఉదయం 10 గంటల 20 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా.. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడడం విశేషం.
అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది.
తొలి భాగం హరిహర వీరమల్లు-1 ది స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ ఈ ఏడాది మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.