Sharwa 37 : శ‌ర్వానంద్ 37 టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ వ‌చ్చేసింది.. బాల‌య్య‌, చ‌ర‌ణ్ చేతుల మీదుగా.. బాల‌య్య సినిమా టైటిట్‌తోనే..

రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ ఓ చిత్రంలో న‌టిస్తున్నారు.

Sharwa 37 : శ‌ర్వానంద్ 37 టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ వ‌చ్చేసింది.. బాల‌య్య‌, చ‌ర‌ణ్ చేతుల మీదుగా.. బాల‌య్య సినిమా టైటిట్‌తోనే..

Sharwa 37 title is Nari Nari Naduma Murari and first look release

Updated On : January 14, 2025 / 11:24 AM IST

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎన్నుకుంటూ ప్రేక్ష‌కులను అల‌రించే హీరోల్లో శ‌ర్వానంద్ ఒక‌రు. రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. శ‌ర్వా కెరీర్‌లో 37వ చిత్రంగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ చిత్ర టైటిల్, ఫ‌స్టు లుక్ పోస్ట‌ర్‌ను సంక్రాంతి సందర్భంగా మెగా, నంద‌మూరి హీరోల చేతుల మీదుగా విడుద‌ల చేయిస్తామ‌ని చిత్ర బృందం చెప్పిన సంగ‌తి తెలిసిందే. చెప్పిన‌ట్లుగానే తాజాగా ఈ చిత్ర టైటిల్‌ను ఫ‌స్టు లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

అన్‌స్టాప‌బుల్ షోలో నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య‌, గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన‌ట్లుగా చిత్ర బృందం తెలియ‌జేసింది.

Sankranthiki Vasthunnam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ.. పడీ పడీ నవ్వాల్సిందే..

ఈ చిత్రానికి ‘నారీ నారీ న‌డుమ మురారి’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఇద్ద‌రు భామ‌లు అరుస్తుండ‌గా రెండు చేతుల‌తో శ‌ర్వా త‌న చెవుల‌ను మూసుకున్న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

Raja Saab : ప్ర‌భాస్ ‘రాజాసాబ్’ నుంచి సంక్రాంతి స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్‌.. ప్ర‌భాస్ ఎంత అందంగా న‌వ్వుతున్నాడో చూశారా?

ఈ చిత్రంలో సంయుక్త‌, సాక్షి వైద్య‌లు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా.. 1990లో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా నారీ నారీ న‌డుమ మురారి అనే సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ఘ‌న‌ విజ‌యం సాధించింది. తాజాగా ఇదే టైటిల్‌తో శ‌ర్వా సినిమా రానుండ‌డంతో ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో మంచి అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి.