Anaganaga Oka Raju : థియేటర్లలో రిలీజ్‌కు ముందే ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ చేసుకున్న నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒకరాజు’ మూవీ..
నవీన్ పొలిశెట్టి నటిస్తున్న మూవీ ‘అనగనగా ఒకరాజు’.

Naveen Polishetty Anaganaga Oka Raju movie OTT Platform fix
నవీన్ పొలిశెట్టి నటిస్తున్న మూవీ ‘అనగనగా ఒకరాజు’. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్ కావడంతో కొన్నాళ్లు ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది.
ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పునః ప్రారంభం కాగా.. టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. కాగా.. ఇంకా థియేటర్లలోకి రానీ ఈ చిత్రం అప్పుడే ఓటీటీ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర ఓటీటీ హక్కులను దక్కించుకుంది.
ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ తెలియజేసింది. రాజు పెళ్లి చేసుకోబోతున్నాడు. థియేటర్లలో రిలీజ్ తరువాత అనగనగా ఒకరాజు నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగ, తమిళం, మలయాళ, కన్నడ బాషల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను పంచుకుంది.
చూస్తుంటే నవీన్ పొలిశెట్టి పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాతో నవీన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి.
View this post on Instagram