Naveen Polishetty Anaganaga Oka Raju movie OTT Platform fix
నవీన్ పొలిశెట్టి నటిస్తున్న మూవీ ‘అనగనగా ఒకరాజు’. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్ కావడంతో కొన్నాళ్లు ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది.
ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పునః ప్రారంభం కాగా.. టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. కాగా.. ఇంకా థియేటర్లలోకి రానీ ఈ చిత్రం అప్పుడే ఓటీటీ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర ఓటీటీ హక్కులను దక్కించుకుంది.
ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ తెలియజేసింది. రాజు పెళ్లి చేసుకోబోతున్నాడు. థియేటర్లలో రిలీజ్ తరువాత అనగనగా ఒకరాజు నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగ, తమిళం, మలయాళ, కన్నడ బాషల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను పంచుకుంది.
చూస్తుంటే నవీన్ పొలిశెట్టి పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాతో నవీన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి.