Allu Arjun : పదిహేనేళ్ల క్రితం అలా వెళ్ళాము.. ఇప్పుడు ఇలా.. గర్వంతో అల్లు శిరీష్, స్నేహ పోస్టులు..
గర్వంతో ఉప్పొంగిపోతున్న అల్లు శిరీష్, స్నేహరెడ్డి. పదిహేనేళ్ల క్రితం అలా వెళ్ళాము, ఇప్పుడు ఇలా అంటూ..

Allu Sirish Sneha Reddy emotional post on Allu Arjun wax statue
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జర్నీ.. చూసేవారికి నిజంగానే ఓ ఐకాన్‌లా నిలుస్తుంది. మెగా హీరోలా ఆడియన్స్ కి పరిచయమైన అల్లు అర్జున్.. తన డాన్స్‌లతో, స్టైల్‌తో ‘స్టైలిష్ స్టార్’ అనే గుర్తింపుని సంపాదించుకున్నారు. ఆ తరువాత నటుడిగా ఐకానిక్ రోల్స్ చేస్తూ ‘ఐకాన్ స్టార్’ అనే టైటిల్ ని సంపాదించుకున్నారు. కేవలం నటనలోనే కాదు అరుదైన గౌరవాలు అందుకోవడంలో కూడా అల్లు అర్జున్ ఐకానిక్ గా నిలిస్తున్నారు.
తాజాగా ఈ హీరో ‘మేడమ్ టుస్సాడ్స్’ వంటి వరల్డ్ ఫేమస్ మ్యూజియంలో తన మైనపు విగ్రహం ఏర్పాటు చేసే గౌరవాన్ని అందుకున్నారు. ఈ విగ్రహాన్ని నిన్న మార్చి 28న దుబాయ్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ తో పాటు ఆయన ఫ్యామిలీ కూడా వెళ్ళింది. ఇక ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలను ఫ్యామిలీ మెంబెర్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు.
Also read : Vishwak Sen : ‘లైలా’గా కనిపించబోతున్న మాస్ కా దాస్.. VS12 టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో..
అల్లు శిరీష్.. “పదిహేనేళ్ల క్రితం నేను, బన్నీ కలిసి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకి టూరిస్టులుగా వెళ్ళాము. అక్కడ ఉన్న మైనపు విగ్రహాలతో ఫొటోలు తీసుకున్నాము. కానీ అక్కడ మా ఫ్యామిలీకి సంబంధించిన ఒక మైనపు విగ్రహం ఏర్పాటు అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఏం జర్నీ బన్నీ. నాకు చాలా గర్వంగా ఉంది” అంటూ రాసుకొచ్చారు.
View this post on Instagram
అల్లు స్నేహారెడ్డి.. “ఎక్కడికి వెళ్లిన తనదైన ముద్ర వేసే అల్లు అర్జున్ నేడు మైనపు విగ్రహంగా వరల్డ్ ఫేమస్ మ్యూజియంలో. ఒక భార్యగా ఎంతో గర్వంగా ఉంది. నిన్న జరిగిన ఈవెంట్ ఎప్పటికి గుండెల్లో నిలిచిపోతుంది” అంటూ పేర్కొన్నారు. అలాగే ఈ మైనపు విగ్రహం ఏర్పాటు పై మెగా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా రియాక్ట్ అవుతూ.. బన్నీకి విషెస్ తెలియజేస్తున్నారు.
View this post on Instagram