Allu Arjun – Sirish : అల్లు అర్జున్ – అట్లీ పాన్ ఇండియా సినిమాలో అల్లు శిరీష్..? ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..

ఇటీవలే అల్లు అర్జున్ - అట్లీ దుబాయ్ కి వెళ్లి స్టోరీ సిట్టింగ్స్ కూడా చేసారు.

Allu Sirish will Play Key Role in Allu Arjun Atlee Movie Rumors goes Viral

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2తో పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకొని నేషనల్ వైడ్ స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమాతో వస్తాడు అని అంతా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాకు ఇంకా సమయం పడుతుండటంతో అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేయబోతున్నాడని సమాచారం. అట్లీతో పక్కా మాస్ కమర్షియల్ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు.

ఇటీవలే అల్లు అర్జున్ – అట్లీ దుబాయ్ కి వెళ్లి స్టోరీ సిట్టింగ్స్ కూడా చేసారు. త్వరలోనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించి సమ్మర్ తర్వాత షూట్ మొదలుపెడతారని సమాచారం. అయితే తాజాగా అల్లు శిరీష్ – అట్లీ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తుంది. అట్లీ – అల్లు అర్జున్ సినిమాలో అల్లు శిరీష్ కూడా ఓ చిన్న పాత్ర చేస్తాడని వినిపిస్తుంది.

Also Read : Chiranjeevi – Anil Ravipudi : పండగ పూట.. గ్రాండ్ గా చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా ఓపెనింగ్.. వెంకటేష్ గెస్ట్ గా..

ఇటీవల అల్లు శిరీష్ కూడా దుబాయ్ కి వెళ్లి వచ్చాడు. బన్నీ – అట్లీ వెళ్లిన సమయంలోనే వెళ్లడంతో శిరీష్ కూడా స్టోరీ సిట్టింగ్స్ కి వెళ్లాడని, తన పాత్ర గురించి మాట్లాడారని వినిపిస్తుంది. దీంతో అట్లీ – అల్లు అర్జున్ సినిమాలో అల్లు శిరీష్ కూడా ఒక గెస్ట్ రోల్ చేస్తాడని అనుకుంటున్నారు. ఇదే నిజమయి అన్నదమ్ములు కలిసి కనిపిస్తే బన్నీ ఫ్యాన్స్ కి పండగే.

ఇక అల్లు శిరీష్ అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. చివరగా బడ్డీ అనే సినిమాతో పలకరించినా అది ఫ్లాప్ గానే మిగిలింది.