Chiranjeevi – Anil Ravipudi : పండగ పూట.. గ్రాండ్ గా చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా ఓపెనింగ్.. వెంకటేష్ గెస్ట్ గా..

నేడు ఉగాది రోజున చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం..

Chiranjeevi – Anil Ravipudi : పండగ పూట.. గ్రాండ్ గా చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా ఓపెనింగ్.. వెంకటేష్ గెస్ట్ గా..

Megastar Chiranjeevi Anil Ravipudi Movie Opening with Venkatesh Guest on Ugadi

Updated On : March 30, 2025 / 11:10 AM IST

Chiranjeevi – Anil Ravipudi : ఇటీవల వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి అనిల్ రావిపూడి ట్వీట్ వేసి ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ పేరు శంకర్ వరప్రసాద్ అని, ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అని, స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది అని తెలిపాడు.

నేడు ఉగాది రోజున చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నిర్మాతలు, దర్శకులు, రాఘవేంద్రరావు, నాగబాబు, సురేష్ బాబు, అల్లు అరవింద్.. అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Also Read : Chiranjeevi – Anil Ravipudi : నేడే అనిల్ రావిపూడి – మెగాస్టార్ సినిమా ఓపెనింగ్.. ఇక్కడ లైవ్ చూడండి.. వెంకీమామ గెస్ట్ గా..?

ఈ ఈవెంట్ కి వెంకటేష్ గెస్ట్ గా వచ్చాడు. అల్లు అరవింద్, రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా వెంకటేష్ చిరంజీవి పై క్లాప్ కొట్టారు. ఇక చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాని షైన్ స్క్రీన్స్ తో పాటు చిరంజీవి కూతురు సుస్మితకు చెందిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నాయి.

Megastar Chiranjeevi Anil Ravipudi Movie Opening with Venkatesh Guest on Ugadi

ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ఫుల్ ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడితో సినిమా, కామెడీ సినిమా, సంక్రాంతి రిలీజ్ అనడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.