AM Ratnam: కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీకి సీక్వెల్ కన్ఫం చేసిన ప్రొడ్యూసర్!
ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం గతంలో ఖుషి వంటి బ్లాక్‌బస్టర్ మూవీని ప్రొడ్యూస్ చేసి టాలీవుడ్‌లో భారీ సక్సెస్‌ను అందుకున్నారు. ఇక ఈ నిర్మాత సూర్య మూవీస్ బ్యానర్‌పై పలు ఇంట్రెస్టింగ్ సినిమాలను తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నారు. అయితే అందరూ కొత్తవాళ్లో ఏఎం.రత్నం ప్రొడ్యూస్ చేసిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరి ‘7/G బృందావన కాలని’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

AM Ratnam Confirms Sequel To 7G Brindavan Colony
AM Ratnam: ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం గతంలో ఖుషి వంటి బ్లాక్‌బస్టర్ మూవీని ప్రొడ్యూస్ చేసి టాలీవుడ్‌లో భారీ సక్సెస్‌ను అందుకున్నారు. ఇక ఈ నిర్మాత సూర్య మూవీస్ బ్యానర్‌పై పలు ఇంట్రెస్టింగ్ సినిమాలను తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నారు. అయితే అందరూ కొత్తవాళ్లో ఏఎం.రత్నం ప్రొడ్యూస్ చేసిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరి ‘7/G బృందావన కాలని’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
రత్నం గారిని నాతో సినిమా చెయ్యమని అడిగాను.. పవన్ కళ్యాణ్..
దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ సినిమా ఆ సమయంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో రవికృష్ణ హీరోగా, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించి యూత్‌ను ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు ‘ఖుషి’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్న సందర్భంగా నిర్మాత ఏఎం.రత్నం మీడియాతో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన త్వరలోనే ఈ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీకి సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సీక్వెల్ మూవీని కూడా సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేస్తారని.. ఇందులోనూ హీరోగా రవికృష్ణ నటిస్తాడని ఏఎం.రత్నం తెలిపారు. 2004లో రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీకి సీక్వెల్ అని తెలియగానే ప్రేక్షకుల్లో ఈ సినిమా సీక్వెల్‌పై అప్పుడే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరి ఈ సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తారో చూడాలి.