TG Vishwa Prasad : అమెరికాలో జనసైనికుల సంబరాలు.. పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేసిన తెలుగు నిర్మాతని అభినందించి..
అమెరికాలోని సియాటిల్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు విమానాశ్రయంలో జనసేన మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు.
- Saketh U
- Published On : July 12, 2024 / 05:55 PM IST
Amaerica Janasena Followers Felicitate Producer TG Vishwa Prasad and Celebrated Janasena Victory
TG Vishwa Prasad : ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా దూసుకుపోతుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ వరుస సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అయితే నిర్మాత విశ్వ ప్రసాద్ ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ కి, జనసేనకు మద్దతు ఇస్తూ అండగా నిల్చున్నారు. పవన్ కళ్యాణ్ కి, విశ్వ ప్రసాద్ కి మధ్య మంచి స్నేహం ఉంది. ఎన్నికల్లో జనసేన పార్టీకి విశ్వ ప్రసాద్ వెనకుండి బాగా సపోర్ట్ చేసారు.
జనసేన ప్రవాస గర్జన అని అమెరికాలో కూడా ప్రచారం చేసారు నిర్మాత విశ్వ ప్రసాద్. ఏపీలో NDA కూటమి గెలిచిన తర్వాత సినీ పరిశ్రమ అందర్నీ పిలిచి ఓపెన్ గా సంబరాలు నిర్వహించారు. జనసేన గెలుపుకు పాటుపడ్డ పలువురు సినీ పరిశ్రమ వ్యక్తులను సత్కరించారు. అయితే ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం విశ్వ ప్రసాద్ మొదటిసారి అమెరికా వెళ్లారు. దీంతో అమెరికాలోని సియాటిల్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు విమానాశ్రయంలో జనసేన మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు.
Also Read : Nabha Natesh Brother : నభా నటేష్ తమ్ముడ్ని చూశారా? సిక్స్ ప్యాక్‌తో హీరోలా ఉన్నాడుగా..
అనంతరం సియాటిల్‌లోని శ్రీదేవి ఫంక్షన్ హాల్‌లో జన సైనికులు, తెలుగుదేశం మద్దతుదారులు విశ్వ ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. జనసేన పార్టీ భారీ విజయం సాధించినందుకు సంబరాలు చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో నిర్మాత విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. మనందరి సమన్వయం వల్లే కుటమి ఎన్నికల్లో విజయం సాధించింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మద్దతుదారులు ఇకపై కూడా కలిసి పనిచేయాలి అని అన్నారు.
