Site icon 10TV Telugu

Thode Nuvvundaka Lyrical : అమల చేతుల మీదుగా నచ్చినవాడు నుంచి ‘తోడై నువ్వుండక’ లిరిక‌ల్‌

Thode Nuvvundaka Lyrical

Thode Nuvvundaka Lyrical

Thode Nuvvundaka Lyrical Song : లక్ష్మణ్ చిన్నా ప్రధాన పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న సినిమా నచ్చినవాడు. ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం పై లక్ష్మణ్ చిన్నా, వెంకట రత్నం లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మిజో జోసెఫ్ సంగీతాన్ని అందిస్తుండ‌గా కావ్య రమేష్ హీరోయిన్‌. కె. దర్శన్, నాగేంద్ర అరుసులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా ఇటీవ‌ల ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 20ల‌క్ష‌ల మందికి పైగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను యూట్యూబ్‌లో వీక్షించారు.

‘నా మనసు నిన్ను చేర, ఎదపొంగెనా ఏమో అనే లిరిక‌ల్ పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఎదపొంగెనా ఏమో సాంగ్ టాప్ ఇండియన్ సాంగ్ ఆఫ్ ది వీక్ గా ఎంపికైంది. తాజాగా ‘తోడై నువ్వుండక’ అనే మెలోడీ పాటను అక్కినేని అమల చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఈ పాట‌కు హర్షవర్ధన్ రెడ్డి లిరిక్స్ రాయ‌గా సయొనోరా ఫిలిప్స్ పాడారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

Payal Rajputh : పెళ్లి కాలేద‌ని బాదొద్దు.. పెళ్లైన వాళ్లు కూడా దాని కోసమే వెదుకులాట‌.. పాయ‌ల్ ఇన్‌స్టా పోస్ట్ పై నెటీజ‌న్ల ఫైర్‌

పాట‌ను విడుద‌ల చేసిన సంద‌ర్భంగా అమల మాట్లాడుతూ.. పాట అద్భుతంగా ఉంద‌న్నారు. మంచి మెలోడీ పాటను అందించిన సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ అభినందించ‌డంతో పాటు ఈ చిత్రం మంచి విజయం సాధించాలి ఆకాంక్షించారు.

దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ.. పాట‌ను రిలీజ్ చేసిన అమ‌లకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ఇలాంటి పాట‌ను అమ‌ల విడుద‌ల చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. స్త్రీ సెల్ఫ్ రెస్పెక్ట్ కథాంశంగా చేసుకుని ప్రేమ కథగా తెర‌కెక్కించామ‌న్నారు. కామెడీతో పాటు నేటి యువ‌త‌కు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్న‌ట్లు చెప్పారు. ఆగస్టు 24న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు తెలియ‌జేశారు.

HBD Mahesh Babu: ఇందుకే మహేశ్ బాబు సూపర్ స్టార్ అయ్యాడు.. లేకపోతేనా..

 

Exit mobile version