Payal Rajputh : పెళ్లి కాలేదని బాదొద్దు.. పెళ్లైన వాళ్లు కూడా దాని కోసమే వెదుకులాట.. పాయల్ ఇన్‌స్టా పోస్ట్ పై నెటీజన్ల ఫైర్
ఆర్‌ఎక్స్100 చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్‌పుత్(Payal Rajput). మొదటి సినిమాతోనే యువత హృదయాల్లో చెదరని ముద్ర వేసింది.

Payal Rajputh
Payal Rajput insta post : ‘ఆర్‌ఎక్స్100’ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్‌పుత్(Payal Rajput). మొదటి సినిమాతోనే యువత హృదయాల్లో చెదరని ముద్ర వేసింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ‘వెంకీమామ’, ‘డిస్కో రాజా’, ‘తీస్‌మార్ ఖాన్’ వంటి సినిమాల్లో నటించినా తనదైన ముద్రను వేయలేకపోయింది. సినిమాల సంగతి ఎలాగున్నా సరే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ముఖ్యంగా తన గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ఓ పోస్ట్ నెట్టింట రచ్చ లేపింది. ‘నీకు ఇంకా సోల్‌మేట్ దొరకలేదని బాధపడకు. ఎందుకంటే పెళ్లైన వాళ్లు కూడా తమ సోల్‌మేట్‌ల కోసం వెతుకుతున్నారు.’ అంటూ పాయల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వైరల్‌గా మారగా చాలా మంది నెటీజన్లు అమ్మడిపై మండిపడుతుండగా కొందరు ఆమెకు సపోర్టు చేస్తున్నారు. ఇందులో తప్పేమీ లేదని పెళ్లి చేసుకునే వారితో పాటు పెళ్లైన వాళ్లు కూడా అభద్రతతో ఉన్నారని ఆమె పోస్టుకు అర్థం అంటూ ఓ నెటీజన్ కామెంట్ చేయగా పెళ్లైన వాళ్లు సోల్‌మేట్‌ల కోసం వెతుకుతున్న కారణంగా విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారంటూ మరో నెటీజన్ కామెంట్ చేశారు.
Jailer Advance Booking : విడుదలకు ముందే అమెరికాలో జైలర్ రికార్డు కలెక్షన్లు..!
అయితే.. కొందరు మాత్రం భారతీయ పెళ్లి వ్యవస్థను పాయల్ రాజ్‌పుత్ అవమానించిందంటూ మండిపడుతున్నారు. తనకు పెళ్లిపై ఆసక్తి లేకపోతే ఒంటరిగానే ఉండమని సలహా ఇస్తున్నారు. అంతేకాని ఇలా ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు.
ఈ సంగతి కాస్త పక్కన బెడితే.. ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న చిత్రం ‘మంగళవారం’. ఆర్‌ఎక్స్100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతినే ఈ సినిమాకు డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. మంగళవారం సినిమా విజయం సాధించడం అటు దర్శకుడిగా అజయ్ భూపతితో పాటు ఇటు పాయల్ రాజ్‌పుత్ కి ఎంతో ముఖ్యం. వీరిద్దరు ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు.
Devara : రెండు భాగాలుగా ఎన్టీఆర్ దేవర.. వైరల్ అవుతున్న న్యూస్ నిజమేనా..?

Payal Rajput insta post