Devara : రెండు భాగాలుగా ఎన్టీఆర్ దేవర.. వైరల్ అవుతున్న న్యూస్ నిజమేనా..?
ఎన్టీఆర్ దేవర సినిమా రెండు భాగాలుగా రాబోతోందా..? నెట్టింట తెగ వైరల్ అవుతున్న న్యూస్.

NTR Janhvi Kapoor Saif Ali Khan Devara is shot in two parts
Devara : RRR తరువాత ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. నందమూరి కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్గా, సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇది ఇలా ఉంటే, ఈ మూవీకి సంబంధించిన ఏదొక ఇంటరెస్టింగ్ న్యూస్ నెట్టింట డైలీ వైరల్ అవుతూ వస్తుంది.
Mahesh Babu : మహేష్‌కి టాలీవుడ్ సెలబ్రిటీస్ బర్త్ డే విషెస్.. ఎవరెవరు విష్ చేశారో తెలుసా..?
తాజాగా ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందంటూ టాక్ వినిపిస్తుంది. దేవరలో హీరో పాత్ర అనుకున్న దానికన్నా గొప్పగా రావడంతో.. కొరటాల శివ దేవర్ పార్ట్ 2 కూడా తీయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సెకెండ్ పార్ట్‌పై ఊగాహానాలు వస్తున్నా.. అత్యంత గోప్యంగా ఉంచారు. దేవర్ పార్ట్ వన్ పూర్తయిన తర్వాతే పార్ట్ టూపై ప్రకటన చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్ వంటి సినిమాలు రెండు పార్ట్స్ గా వచ్చి సక్సెస్ అయితే.. ఫుష్ప, సలార్ సినిమాలు అదే దారిలో పయనించబోతున్నాయి. ఇప్పుడు దేవర కూడా అదే అలానే ప్లాన్ చేద్దామని చూస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు.
కాగా దేవర సినిమాలో హాలీవుడ్ రేంజ్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి. ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ‘ట్రాన్స్ఫార్మర్స్’కు పని చేసిన స్టంట్ మాస్టర్, ఆక్వా మ్యాన్ చిత్రానికి వర్క్ చేసిన VFX డిజైనర్.. ఈ మూవీ ప్రొడక్షన్ లో భాగం అయ్యారు. అనిరుద్ ఈ సినిమాకి రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సిద్ధం చేస్తున్నారు.