Jailer Advance Booking : విడుద‌ల‌కు ముందే అమెరికాలో జైల‌ర్ రికార్డు క‌లెక్ష‌న్లు..!

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న చిత్రం ‘జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఆగ‌స్టు 10న‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Jailer Advance Booking : విడుద‌ల‌కు ముందే అమెరికాలో జైల‌ర్ రికార్డు క‌లెక్ష‌న్లు..!

Jailer Advance Booking

Updated On : August 9, 2023 / 3:30 PM IST

Jailer Advance Booking USA Collections :సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) న‌టిస్తున్న చిత్రం ‘జైలర్'(Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా రేపు(ఆగ‌స్టు 10 గురువారం) ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ప‌లు చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభ‌మ‌య్యాయి. అమెరికాలో 340 లొకేష‌న్స్‌లో అడ్వాన్స్ బుకింగ్ మొద‌లుపెట్ట‌గా.. టికెట్లు హాట్ కేకుల్లాగా అమ్ముడు అయ్యాయి. 815 షోల‌కు గాను 37,116 టికెట్లు అమ్మ‌గా ఎనిమిది ల‌క్ష‌ల డాల‌ర్ల‌కు పైగా వ‌చ్చింది. అంటే మ‌న భార‌త క‌రెన్సీలో రూ.6.64 కోట్లు.

ఈ క్ర‌మంలో అమెరికాలో ఈ ఏడాది విడుద‌లైన భార‌తీయ సినిమాల్లో అత్య‌ధిక అడ్వాన్స్ బుకింగ్ క‌లెక్ష‌న్లు సాధించిన చిత్రంగా జైల‌ర్ స‌రికొత్త రికార్డును క్రియేట్ చేసింది. సినిమా విడుద‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉండ‌డంతో ఈజీగా మిలియ‌న్ డాల‌ర్ మార్క్‌ను చేరుతుంద‌ని సినీ పండితులు అంచ‌నా వేస్తున్నారు. ఇక మ‌న‌దేశంలో చెన్నై, బెంగ‌ళూరులో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ 3.46 కోట్లు, రూ.4.70కోట్లు వ‌సూలు చేసింది. ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం మ‌న దేశంలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా రూ12.83కోట్లు రాబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.

Jailer Release : గ‌ట్లుంట‌దీ సూప‌ర్‌స్టార్ క్రేజ్ అంటే.. ‘జైలర్‌’ రిలీజ్‌ రోజు బెంగళూరు, చెన్నై ఆఫీసుల‌కు సెలవు, ఫ్రీగా టికెట్లు..

సినిమా విడుద‌ల‌కు ముందే అమెరికాలో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన త‌మిళ‌ చిత్రంగా క‌బాలి ఉంది. 2016లో రిలీజైన ఈ సినిమా ప్రీమియ‌ర్స్ స‌మ‌యానికి 19ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌సూలు చేయ‌గా, ఆ త‌రువాతి స్థానంలో పొన్నియ‌న్ సెల్వ‌న్ 1 చిత్రం 11ల‌క్ష‌ల డాల‌ర్ల‌తో రెండో స్థానంలో నిలిచింది. జైల‌ర్ సినిమా 8 ల‌క్ష‌ల డాల‌ర్ల‌కుపై వ‌సూళ్ల‌లో ఆల్‌టైం త‌మిళ సినిమా లిస్టులో మూడో స్థానంలో కొన‌సాగుతోంది.

జైల‌ర్ సినిమాకి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందించాడు. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో త‌మ‌న్నా (Tamannaah) హీరోయిన్‌. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్ (Mohanlal), రమ్యకృష్ణ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Chiranjeevi: చిరంజీవి అభిమానుల ఆందోళనలో తీవ్ర ఉద్రిక్తత.. పలువురి అరెస్టు.. వీడియోలు