Amala Paul : కథ డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించేందుకు కూడా సిద్దమే.. అమలాపాల్!
ఆడుజీవితం సినిమాలో పృథ్వీరాజ్ తో అమలాపాల్ లిప్ లాక్ పై వస్తున్న ట్రోల్స్ కి గట్టి సమాధానం ఇచ్చింది. న్యూడ్ గా నటించేందుకే సిద్దమైన తనకి లిప్ లాక్..

Amala Paul reply on kiss with Prithviraj Sukumaran trolls
Amala Paul : మలయాళ భామ అమలాపాల్ సౌత్ లాంగ్వేజ్స్ తో పాటు హిందీ భాషలో కూడా పలు సినిమాల్లో నటించి అలరించిస్తు వస్తుంది. ప్రస్తుతం ఈ భామ మలయాళంలో రెండు సినిమాలు, తమిళంలో ఒక మూవీ చేస్తుంది. శాండిల్ వుడ్ లో పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) హీరోగా నటిస్తున్న ‘ఆడుజీవితం’ (Aadujeevitham) సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతుంది. నేషనల్ అవార్డు విన్నర్ బ్లేస్సి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ది గోట్ లైఫ్ పేరుతో ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయనున్నారు. దాదాపు 10 ఏళ్ళ నుంచి ఈ సినిమాని తెరకెక్కిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.
NTR – Allu Arjun : పుష్ప 2 సెట్స్ లో ఎన్టీఆర్.. పిక్ వైరల్!
కాగా ఇటీవల ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ లో పృథ్వీరాజ్ మేక్ ఓవర్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇక ఇదే ట్రైలర్ లో పృథ్వీరాజ్ తో అమలాపాల్ లిప్ లాక్ సీన్ చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల హాట్ ఫోటోషూట్ లతో రచ్చ చేస్తున్న అమలాపాల్ ఇప్పుడు ఘాటైన లిప్ లాక్ సీన్ లో కనిపించడంతో.. ఈ అమ్మడి బోల్డ్ సన్నివేశాల జోరు ఇప్పట్లో తగ్గేలా లేదంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ లిప్ లాక్ సన్నివేశం పై అమలాపాల్ రెస్పాండ్ అయ్యింది.
Krishan Perera : దుబాయ్ జైలు నుంచి రిలీజ్ అయిన బాలీవుడ్ నటి..
ఈ సినిమాకి తాను సైన్ చేసినప్పుడే దర్శకుడు లిప్ లాక్ సన్నివేశం గురించి చెప్పినట్లు వెల్లడించిన అమలాపాల్.. సన్నివేశం పండాలంటే అది తప్పనిసరి అని ఓకే అన్నట్లు చెప్పుకొచ్చింది. కథ డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించేందుకు కూడా సిద్దమే అని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన అమలాపాల్.. న్యూడ్ గా నటించేందుకే సిద్దమైన తనకి లిప్ లాక్ పెద్ద ఇబ్బంది అనిపించలేదు అంటూ చెప్పుకొచ్చింది. కాగా గతంలో ఈ భామ ‘ఆమె’ సినిమాలో న్యూడ్ గా కనిపించిన విషయం తెలిసిందే.