Krishan Perera : దుబాయ్ జైలు నుంచి రిలీజ్ అయిన బాలీవుడ్ నటి..

డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో దుబాయ్ లో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటి రిలీజ్ అయ్యింది. అయితే ఆమెను ఈ కేసు ఇరికించారట. అసలు కథ ఏంటంటే.

Krishan Perera : దుబాయ్ జైలు నుంచి రిలీజ్ అయిన బాలీవుడ్ నటి..

Bollywood Actress Krishan Perera released from smuggling case in dubai

Updated On : April 27, 2023 / 10:59 AM IST

Krishan Perera : బాలీవుడ్ నటి క్రిషన్ పెరీరా ఈ నెల (ఏప్రిల్) మొదటిలో షార్జా పోలీసులు డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేశారు. క్రిషన్ సడక్ 2 (Sadak 2) మరియు బాట్లో హౌస్ (Batla House) వంటి హిందీ చిత్రాల్లో నటించింది. ఈ నెల మొదటిలో ఒక వెబ్ సిరీస్ కోసం దుబాయ్ వెళ్లిన క్రిషన్ పెరీరా.. అక్కడ డ్రగ్స్ తో పెట్టుబడి జైలులోకి వెళ్ళింది. అయితే ఇదంతా ఆమెను ఇరికించేందుకు ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్లు కుట్ర అని తెలుసుకున్న షార్జా పోలీసులు ఆమెను విడిచి పెట్టారు.

Pooja Ramachandran : సముద్రపు ఒడ్డున.. భర్తతో పూజా రామచంద్రన్ బేబీ బంప్ ఫొటోషూట్..

ఆమెను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను ముంబై క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. నిందితులను మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాకు చెందిన రాజేష్ బభోపే అలియాస్ రవి, ముంబైలోని బోరివలి నివాసి ఆంథోనీ పాల్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలియజేసిన వివరాలు ప్రకారం.. “అంతర్జాతీయ వెబ్ సిరీస్ ఆడిషన్ ఇచ్చేందుకు దుబాయ్ వెళ్ళాలి అంటూ క్రిషన్ పెరీరాని ఆంథోనీ పాల్ మరియు రవి ఆమెను దుబాయ్ పంపించారు. అయితే ఆమెకు తెలియకుండా ఆమె ట్రోఫీలో డ్రగ్స్ ని దాచి పెట్టారు. ఈ విషయం గమనించిన క్రిషన్ దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో పోలీసులకు పట్టుబడింది. అయితే విచారణలో ప్లాన్ ప్రకారం ఆమెను ఇరికించారని తెలియడంతో అసలైన నిందితులను అరెస్ట్ చేసాం” అంటూ చెప్పుకొచ్చారు.

AR Rahman : భార్యను హిందీ వద్దు.. తమిళ్ లో మాట్లాడమన్నందుకు AR రెహమాన్ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు..

గతంలో పాల్ మరో నలుగురిని కూడా ఇలాగే ఇరికించాడని అధికారులు తెలుసుకున్నారు. కాగా క్రిషన్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఈ పని పెరెరాపై ప్రతీకార చర్యగా ఆంథోనీ పాల్ ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.