AR Rahman : భార్యను హిందీ వద్దు.. తమిళ్ లో మాట్లాడమన్నందుకు AR రెహమాన్ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు..

తాజాగా AR రెహమాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చెన్నైలో ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో రెహమాన్ తన భార్య సైరా భానుతో కలిసి పాల్గొన్నాడు.

AR Rahman : భార్యను హిందీ వద్దు.. తమిళ్ లో మాట్లాడమన్నందుకు AR రెహమాన్ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు..

AR Rahman trolled by netizens in hindi vs tamil issue

AR Rahman :  తమిళనాడులో(Tamilanadu) గత కొన్నాళ్లుగా హిందీ(Hindi) వర్సెస్ తమిళ్(Tamil) వివాదం నడుస్తూనే ఉంది. కానీ కొంతమంది అన్ని పరిశ్రమలలో పని చేసే సెలబ్రిటీలు తెలిసో తెలియకో హిందీ వర్సెస్ తమిళ్ వివాదంలో నిలుస్తున్నారు. ఆస్కార్(Oscar) విన్నర్ సంగీత దర్శకుడు, ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన AR రెహమాన్(AR Rahman)కు దేశమంతటా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన పాటలకు, ఆయనకు భాషతో సంబంధం లేకుండా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

తాజాగా AR రెహమాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చెన్నైలో ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో రెహమాన్ తన భార్య సైరా భానుతో కలిసి పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో అవార్డు అందుకోవడానికి రెహమాన్ తన భార్యతో కలిసి స్టేజి మీదకు వచ్చారు. అవార్డు తీసుకున్న అనంతరం రెహమాన్ మాట్లాడారు. అక్కడ ఉన్న వాళ్ళు రెహమాన్ భార్యని కూడా మాట్లాడమనగా రెహమాన్ తన భార్యని ఉద్దేశిస్తూ.. హిందీలో మాట్లాడకు తమిళ్ లో మాట్లాడు అని అన్నారు. సైరా భాను.. తనకు తమిళ్ అంతగా రాదని, క్షమించమని ఇంగ్లీష్ లో మాట్లాడింది.

Anil Sunkara : డైరెక్టర్‌గా సినిమా చేస్తానంటున్న ఏజెంట్ నిర్మాత.. అది కూడా భారీ బడ్జెట్ లో..

అయితే ఇప్పుడు AR రెహమాన్ తన భార్యను హిందీలో మాట్లాడొద్దు, తమిళ్ లోనే మాట్లాడమని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్లు రెహమాన్ ని విమర్శిస్తున్నారు. ఆమె ఏ భాషలో మాట్లాడాలో మీరే డిసైడ్ చేస్తారా? హిందీ పాటలు పాడి డబ్బులు సంపాదించొచ్చు కానీ హిందీలో మాట్లాడకూడదా? హిందీ అంటే అంత ద్వేషం ఎందుకు? అంటూ రెహమాన్ ని పలువురు విమర్శిస్తున్నారు. ఓ పక్క హిందీ వాళ్ళు ఇలా విమర్శిస్తుంటే మీ భార్యకు తనకు నచ్చిన భాషలో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా అంటూ స్త్రీవాదులు కూడా రెహమాన్ ని విమర్శిస్తున్నారు.