Amaran : అమరన్ సక్సెస్.. ఎమోషనల్ అవుతూ.. శివకార్తికేయన్ కి హగ్స్ ఇచ్చిన లేడీ ఫ్యాన్స్.. వీడియో చూసారా

Amaran movie success getting emotional lady fans gave hugs to Sivakarthikeyan
Amaran : తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘అమరన్’. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కించారు. నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో చాలా ఎమోషనల్ గా ఉంది. ఈ సినిమాలోని కథ, ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా శివ కార్తికేయన్ పర్ఫార్మెన్స్‌తో పాటు సాయి పల్లవి నటన నెక్స్ట్ లెవెల్ లో ఉండడంతో మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది.
Also Read : Nani-Srikanth Odela : దసరా డైరెక్టర్ తో ప్యారడైజ్ మొదలుపెట్టిన నాని..
అయితే తాజాగా ఈ సినిమాకి సంబందించిన సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్ కి శివకార్తికేయన్, సాయి పల్లవి లతో పాటు చిత్రబృందం కూడా వచ్చింది.ఈ ఈవెంట్ లో శివకార్తికేయన్ తో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు ఫ్యాన్స్. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యారు. శివకార్తికేయన్ కి హగ్స్ ఇస్తూ ఏడ్చేశారు. కొందరు వాటిని చూసి షాక్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
View this post on Instagram