భాయ్ బర్త్‌డే – నో సెలబ్రేషన్స్
33వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న రాకింగ్ స్టార్ యష్

33వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న రాకింగ్ స్టార్ యష్
2018లో కె.జి.ఎఫ్. సినిమాతో, శాండల్ వుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్ సినీ పరిశ్రమల్లో సెన్సేషన్ క్రియేట్ చేసాడు, రాకింగ్ స్టార్ యష్.. కన్నడ నాట రూ.100 కోట్లు సాధించిన సినిమాగా కె.జి.ఎఫ్. రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీ, తెలుగులోనూ రికార్డ్ స్థాయి వసూళ్ళు రాబడుతుంది. జనవరి 8న రాకింగ్ స్టార్ బర్త్‌డే. ఈ ఏడాదితో 33వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు యష్. అసలే ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు, అలాంటి టైమ్‌లో అభిమాన హీరో పుట్టిన రోజు వస్తే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఈ బర్త్‌డేకి కన్నడ నాట యష్ ఫ్యాన్స్ కూడా భారీగా సెలబ్రేషన్స్ ప్లాన్ చేసారు. కానీ, ఈసారి తాను పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం లేదనీ, అభిమానులెవరూ కూడా ఎటువంటి హడావిడి చెయ్యొద్దని యష్ చెప్పాడు.
ఎందుకు యష్ బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోవడం లేదంటే, 2018 నవంబర్ 24న, కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ మృతి చెందారు. అంబరీష్‌కి యష్ అత్యంత ఆప్తుడు. వీళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అంబరీష్ మరణంతో కన్నడ పరిశ్రమ పెద్ద దిక్కుని కోల్పోయింది. అంబరీష్ కుటుంబం, కన్నడ ప్రజలు బాధలో ఉండగా, తను మాత్రం సంతోషంతో సంబరాలు చేసుకోవడం మంచి పద్ధతి కాదని, యష్ తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకోవడం లేదు. తను ఈ మాట చెప్పడంతో, సినీ పెద్దలు, అభిమానులు, వయసులో చిన్నవాడే అయినా, మంచి సంస్కారం ఉన్నవాడని యష్‌ని అభినందిస్తున్నారు.