Ameer Log : అమీర్ లోగ్ ఫస్ట్ లుక్ రిలీజ్.. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో..
నేడు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ని హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. (Ameer Log)

Ameer Log
Ameer Log : అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణ రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అమీర్ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా.. వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి.. పలువురు కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.
నేడు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ని హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ‘అమీర్ లోగ్’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ అనంతరం శ్రీ విష్ణు మూవీ టీంకి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
Also Read : K Ramp : వామ్మో.. కిరణ్ అబ్బవరం సినిమాలో మొత్తం ఎన్ని లిప్ కిస్ లు ఉండబోతున్నాయో తెలుసా?
అమీర్ లోగ్ టైటిల్, పోస్టర్ చూస్తుంటే.. ఇది ముగ్గురు స్నేహతుల చుట్టూ తిరిగే ఓ కామెడీ కథ అని, హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ జరగనుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.