K Ramp : వామ్మో.. కిరణ్ అబ్బవరం సినిమాలో మొత్తం ఎన్ని లిప్ కిస్ లు ఉండబోతున్నాయో తెలుసా?

ఇటీవల రిలీజయిన K ర్యాంప్ టీజర్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. (K Ramp)

K Ramp : వామ్మో.. కిరణ్ అబ్బవరం సినిమాలో మొత్తం ఎన్ని లిప్ కిస్ లు ఉండబోతున్నాయో తెలుసా?

K Ramp

Updated On : October 10, 2025 / 5:53 PM IST

K Ramp : కిరణ్ అబ్బవరం దీపావళికి ముందు అక్టోబర్ 18న K ర్యాంప్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్, సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీ, కామెడీతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. యుక్తి తరేజా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.(K Ramp)

ఇటీవల రిలీజయిన K ర్యాంప్ టీజర్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో కొన్ని బూతులు, లిప్ కిస్ లు ఉండటంతో టీజర్ ట్రెండ్ అయింది. అయితే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ వరస్ట్ గా ఉంటుందట. ఆ క్యారెక్టర్ తో హీరోయిన్ తో మంచి రొమాన్స్ సీన్స్, లిప్ కిస్ సీన్స్ ఉన్నాయట సినిమాలో.

Also Read : Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..? కరెక్ట్ డేట్ పట్టారుగా..

తాజా సమాచారం ప్రకారం K ర్యాంప్ సినిమాలో ఏకంగా 16 లిప్ కిస్ లు ఉన్నాయట. అయితే ఈ సినిమా ఇంకా సెన్సార్ అవ్వలేదు. మరి సెన్సార్ లో ఎన్ని లిప్ కిస్ లు కట్ అవుతాయో, ఎన్ని కిస్ సీన్స్ ఉంచుతారో చూడాలి. టీజర్ లో అయితే మూడు లిప్ కిస్ లు చూపించారు. ట్రైలర్ లో ఎన్ని చూపిస్తారో. ఫైనల్ గా సినిమాలో ఎన్ని లిప్ కిస్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ ఉంటాయో.

కిరణ్ అబ్బవరం ఇప్పటి వరకు అన్ని సాఫ్ట్ పాత్రలే చేసి మెప్పించాడు. మొదటిసారి కొంచెం వైల్డ్ క్యారెక్టర్ తో పాటు ఓవర్ రొమాన్స్ , లిప్ కిస్ సీన్స్ చేయడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Sasivadane Review : ‘శశివదనే’ మూవీ రివ్యూ.. సరికొత్త క్లైమాక్స్ తో ప్రేమకథ..