Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..? కరెక్ట్ డేట్ పట్టారుగా..

ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందని టాలీవుడ్ టాక్. (Fauji)

Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..? కరెక్ట్ డేట్ పట్టారుగా..

Fauji

Updated On : October 10, 2025 / 5:31 PM IST

Fauji : ప్రభాస్ చివరగా కల్కి సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇటీవల కన్నప్ప సినిమాలో కాసేపు అలరించాడు. ప్రభాస్ చేతిలో మాత్రం దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ రెండు సినిమా షూటింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాడు. రాజాసాబ్ లాస్ట్ షెడ్యూల్ సాంగ్స్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి జనవరి 9న రిలీజ్ కానుంది.(Fauji)

అయితే ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందని టాలీవుడ్ టాక్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా ఇమాన్వి అనే కొత్త అమ్మాయి నటిస్తుంది. ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నాడు. దేశభక్తితో పాటు ఓ మంచి లవ్ స్టోరీ కూడా ఉండబోతుంది ఈ సినిమాలో.

Also Read : Funky Teaser : విశ్వక్ సేన్ ‘ఫంకీ’ టీజర్ వచ్చేసింది.. అనుదీప్ మార్క్ ఫుల్ కామెడీ..

తాజా సమాచారం ప్రకారం ఫౌజీ సినిమా 2026 ఆగస్టు 14 న రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. దేశభక్తి నేపథ్యంలో వచ్చే సినిమా కాబట్టి ఇండిపెండెన్స్ డే ముందు రోజు ఆ వీకెండ్ కి సెట్ అయ్యేలా ఈ ఫౌజీ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ ఫౌజీ సినిమా 60 శాతం షూటింగ్ అయిపోయిందట. ఇంకా 35 రోజులు షూటింగ్ చేస్తే మిగతా సినిమా షూటింగ్ అంతా పూర్తవుతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ మిథున్ చక్రవర్తి , అనుపమ్ ఖేర్, సీనియర్ నటి జయప్రద కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

దీంతో 2026 లో ప్రభాస్ వి రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. జనవరిలో రాజాసాబ్, ఆగస్టు లో ఫౌజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అని తెలియడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ చేతిలో ఈ రెండు సినిమాలు కాకుండా స్పిరిట్, సలార్ 2, కల్కి 2, ప్రశాంత్ వర్మతో సినిమాలు ఉన్నాయి.

Also Read : Sasivadane Review : ‘శశివదనే’ మూవీ రివ్యూ.. సరికొత్త క్లైమాక్స్ తో ప్రేమకథ..