Ameesha Patel : ఓటీటీలో సినిమాలు పిల్లలతో కలిసి చూడలేం.. అంతా గే, స్వలింగ సంపర్కం, అసభ్యకర కంటెంట్స్ ఉన్నాయి..

తాజాగా గదర్ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది అమీషా పటేల్. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓటీటీ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Ameesha Patel : ఓటీటీలో సినిమాలు పిల్లలతో కలిసి చూడలేం.. అంతా గే, స్వలింగ సంపర్కం, అసభ్యకర కంటెంట్స్ ఉన్నాయి..

Ameesha Patel sensational comments on OTT content

Ameesha Patel :  బద్రి, నాని.. లాంటి పలు సినిమాలతో తెలుగులో మెప్పించిన హీరోయిన్ అమీషా పటేల్ ప్రస్తుతం పలు బాలీవుడ్, పంజాబీ సినిమాల్లో నటిస్తుంది. తాజాగా అమీషా పటేల్ గదర్ 2 సినిమాలో నటించింది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. 2001లో వచ్చిన గదర్ సినిమాకు సీక్వెల్ గా గదర్ 2 తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

తాజాగా గదర్ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది అమీషా పటేల్. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓటీటీ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Samantha : చాలా కష్టమైన ఆరు నెలలు గడపబోతున్నాను.. కానీ దీనికి ముగింపు పలకాలి.. సమంత ఎమోషనల్ పోస్ట్..

అమీషా పటేల్ మాట్లాడుతూ.. ఇటీవల వచ్చే సినిమాలు, సిరీస్ లు కుటుంబం అంతా కలిసి చూసేలా ఉండట్లేదు. ముఖ్యంగా ఓటీటీలలో వచ్చే సినిమాలు, సిరీస్ లు అస్సలు చూసేలా లేవు. ఆ సినిమాలని సరదాగా కూర్చొని అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో కూర్చొని చూడలేము. ఓటీటీలో అంతా గే, స్వలింగ సంపర్కం, అసభ్యకరమైన కంటెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. పిల్లలతో కలిసి చూడలేని విధంగా ఓటీటీలో కంటెంట్స్ ఉన్నాయి. ప్రేక్షకులు మంచి సినిమాలు కోరుకుంటున్నారు. మా గదర్ 2 సినిమా పిల్లలు, పెద్దలు అంతా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అని చెప్పింది. దీంతో అమీషా పటేల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పలువురు నెటిజన్లు, ఓటీటీ కంటెంట్ కి సెన్సారు కావలి అని అడుగుతున్న వాళ్లంతా అమీషా ఆవ్యాఖ్యలకి సపోర్ట్ చేస్తున్నారు.

అయితే దీనికి కౌంటర్ గా ఉర్ఫి జావేద్ మాట్లాడుతూ.. గే, లెస్బియన్ ఇలాంటి వాటి గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇన్నాళ్లు ఖాళీగా ఉండేసరికి ఏం మాట్లాడాలో అర్ధం కావట్లేదు ఆమెకు. వాటి గురించి అసలు తెలుసా అని కామెంట్స్ చేసింది.