World Cup final : అమిత్ షాతో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తున్న స్టార్ సింగర్..

నేడు దేశంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫీవర్ కనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్ ని ప్రత్యేక్షంగా చూసేందుకు కేంద్రమంత్రి అమిత్ షా, ఇండియన్ స్టార్ సింగర్ ఆశా భోంస్లే కూడా హాజరయ్యారు.

Amit Shah watch ODI World Cup 2023 along with star singer

World Cup final : నేడు దేశంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫీవర్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కి చేరుకున్న భారత్.. ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈరోజు ఏం జరుగుతుందని అందరిలో ఆసక్తి నెలకుంది. 2003 ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో ఓడిపోయిన భారత్.. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒకరు మ్యాచ్ చూడడంలో నిమగ్నమయ్యారు. ఇక ఈ మ్యాచ్ ని ప్రత్యేక్షంగా చూసేందుకు పలువురు ప్రముఖులు స్టేడియంకి చేరుకున్నారు.

ఈ తుది పోరుకి అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియం వేదిక అయ్యింది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు కేంద్రమంత్రి అమిత్ షా, ఇండియన్ స్టార్ సింగర్ ఆశా భోంస్లే కూడా హాజరయ్యారు. వీరిద్దరూ పక్కపక్కనే కూర్చొని మ్యాచ్ ని వీక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆశా భోంస్లే హిందీ పాటలతో పాటు సౌత్ లోని లాంగ్వేజ్స్ లో పలు పాటలు పాడారు. తెలుగులో కీరవాణి, ఇళయరాజా తదితరుల సంగీత దర్శకత్వంలో ఈమె పాటలు పాడారు.

Also read : Sanjay Gadhvi : ‘ధూమ్’ సిరీస్ డైరెక్టర్ మృతి.. మూడు రోజుల్లో బర్త్‌డే అంతలోనే..!

కాగా మొదటి బ్యాటింగ్ కి దిగిన భారత్.. ప్రస్తుతానికి మూడు వికెట్లు కోల్పోయింది. మొదటి శుభ్‌మ‌న్ గిల్ నాలుగు పరుగులు చేసి పెవిలియన్ కి తిరిగి వెళ్ళాడు. ఆ తరువాత రోహిత్ శర్మ 31 బంతుల్లో 47 పరుగులు చేసి ఫుట్ అయ్యాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ కూడా నాలుగు పరుగులకే పెవిలియన్ కి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 12 ఓవర్లకు 89 పరుగులుగా నిలిచింది.