Amitab Bachchan: బిగ్ బి @ 80.. బాలీవుడ్ బాద్‌షాకు ఎదురేది..?

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11న 80వ వసంతంలోకి అడుగుపెడుతుండటంతో, ఆయన అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇన్నేళ్లుగా వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న బిగ్‌బికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ అభిమానులు, సెలబ్రిటీలు తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు.

Amitab Bachchan: బిగ్ బి @ 80.. బాలీవుడ్ బాద్‌షాకు ఎదురేది..?

Amitab Bachchan Turns 80 Still Delight For Bollywood Directors

Updated On : October 11, 2022 / 4:51 PM IST

Amitab Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11న 80వ వసంతంలోకి అడుగుపెడుతుండటంతో, ఆయన అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇన్నేళ్లుగా వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న బిగ్‌బికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ అభిమానులు, సెలబ్రిటీలు తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలో అమితాబ్ గురించి పలువురు ప్రముఖులు చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Amitabh Bachchan: అర్ధరాత్రి వేళ అభిమానులతో.. జల్సాలో అమితాబ్ బచ్చన్!

కాగా, బిగ్ బి అమితాబ్ సినీ కెరీర్‌పై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇన్నేళ్లుగా భారత సినీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న అమితాబ్ బచ్చన్ గురించి పలువురు సినీ దర్శకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రమేశ్ సిప్పీ అమితాబ్ గురించి మాట్లాడుతూ.. ఆయన షోలే సినిమాలో నటించినప్పటి నుండీ కూడా ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ, ప్రేక్షకులను అలరించేందుకు ఆయన పడుతున్న తాపత్రయం నిజంగా అభినందనీయం. ఇలాంటి నటుడు మున్ముందు కాలంలో మళ్లీ కనిపించడేమో..’’ అంటూ రమేశ్ సిప్పీ తెలిపాడు.

Amitabh Bachchan: అమితాబ్ 80వ పుట్టినరోజు రూ.80లకే టికెట్..

బ్రహ్మాస్త్ర దర్శకుడు అయన్ ముఖర్జీ మాట్లాడుతూ.. ఇండియన్ సినిమాను ఇన్నేళ్లుగా ఏలుతున్న మకుటం లేని మహారాజు బిగ్ బి.. ఇలాంటి నటుడితో పనిచేయడం నిజంగా నా అదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ఒకప్పటి డైరెక్టర్స్‌తో మొదలుకొని, ప్రస్తుతం సినిమాలు తెరకెక్కిస్తున్న దర్శకుల వరకు, అందరికీ అందుబాటులో ఉన్న ఏకైక నటుడు అమితాబ్ బచ్చన్ అని వారు అంటున్నారు. ఇక ఆయనతో పనిచేయడం అంటే, సినిమా రంగానికి చెందిన లైబ్రరీలో పుస్తకాన్ని చదివినట్లే అని వారు అంటున్నారు. ఇలాంటి నటుడికి ఎదురనేది ఉండదని.. వారికి అలుపనేది కూడా ఉండదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాల్లో నటిస్తున్న సీనియర్ మోస్ట్ యాక్టర్‌గానూ అమితాబ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడని పలువురు కామెంట్ చేస్తున్నారు. అటు బుల్లితెరపై కూడా అమితాబ్ ఎవరికీ సొంతం కాని రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ అనే షోను 2000లో స్టార్ట్ చేసిన అమితాబ్, 2022లోనూ ఈ షోను కొనసాగిస్తుండటం నిజంగా విశేషమనే చెప్పాలి.