Amitabh Bachchan Kaun Banega Crorepati season 15 registrations open soon
KBC 15 : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్ గా వ్యవహరిస్తూ చేస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి (Kaun Banega Crorepati) ఎంతటి హిట్టు అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ షోని పలు భాషల్లో కూడా లాంచ్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ క్రమంలోనే తెలుగులో ఈ షోకి అక్కినేని నాగార్జున (Nagarjuna), చిరంజీవి (Chiranjeevi), ఎన్టీఆర్ (NTR) వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. కానీ తెలుగులో ముందు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు ఈ షో పై లేదు.
Samantha : శాకుంతలం సినిమా రిజల్ట్ పై సమంత వైరల్ పోస్ట్..
కానీ హిందీలో మాత్రం దిగ్విజయంగా 14 సీజన్లు పూర్తి చేసేసుకుంది. ఇప్పుడు 15 సీజన్ కి రంగం సిద్ధం అవుతుంది. 15 వ సీజన్ కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ మొదలు అవుతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ప్రోమోని విడుదల చేశారు. క్రేజీగా ఉన్న ఆ ప్రోమో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆ ప్రోమోలో.. ఒక మహిళ కౌన్ బనేగా క్రోర్‌పతి హాట్ సీట్ ని చేరుకునేందుకు మ్యాప్ ని చూస్తూ ఉంటుంది. ఆ తరువాత అండర్ గ్రౌండ్ లో ఒక టన్నెల్ తవ్వుకుంటూ హాట్ సీట్ వరకు చేరుకుంటుంది.
Game Changer : ఇండియన్ 2 నుంచి గేమ్ చెంజర్‌కి శంకర్ షిఫ్ట్.. అప్పుడే క్లైమాక్స్ షూట్?
అండర్ గ్రౌండ్ నుంచి ఆమె హాట్ సీట్ దగ్గరకి రావడం చూసిన అమితాబ్.. ఇక్కడికి రావడానికి ఇంత కష్టం ఎందుకు. ఏప్రిల్ 29 రాత్రి 9 గంటలకు KBC 15 రెజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన వ్యక్తులను KBC బృందం సంప్రదిస్తుంది. అలా షార్ట్ లిస్ట్ చేసిన వ్యక్తులు KBC 15 హాట్ సీట్ వరకు చేరుకుంటారు. సోనీలివ్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.