Twitter Blue Tick : కాళ్ల మీద పడమంటావా.. అమితాబ్ ప్రశ్న.. ట్విట్టర్ బ్లూ టిక్ పై సెలబ్రేటిస్ ఫన్నీ ట్వీట్స్..

ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో పలువురు సెలబ్రెటీస్ బ్లూ టిక్ తొలిగించడంతో అమితాబ్, మెహ్రీన్, నిధి వంటి తారలు ఫన్నీ ట్వీట్స్ చేశారు.

Twitter Blue Tick : ప్రముఖ సోషల్ ప్లాట్‌ఫార్మ్ ట్విట్టర్ (Twitter) సీఈఓ గా ఎలాన్ మస్క్ బాధ్యతలు తీసుకున్న తరువాత ఎన్నో మార్పులు తీసుకు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ ఉండాలంటే యూజర్స్ దానిని సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా కొనుగోలు చేయాలంటూ ప్రకటించాడు. ఈ సబ్‌స్ర్కిప్షన్ కోసం ఏప్రిల్ 20 వరకు గడువుని ఇచ్చాడు. సబ్‌స్ర్కిప్షన్ చెల్లించిన వారి అకౌంట్లలో బ్లూ టిక్‌ను కోల్పోతారని మస్క్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే దేశంలోని పలువురు రాజకీయనేతలు, క్రికెట్ అండ్ మూవీ స్టార్స్ బ్లూ టిక్ మాయం అయ్యింది.

Twitter Blue Verified Badge : లెగసీ బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను తొలగించిన ట్విట్టర్.. ఎవరినీ వదల్లేదు.. ఎలన్ మస్క్ అన్నట్టే చేశాడుగా..!

అయితే ఈ బ్లూ టిక్ తొలిగింపు పై సినీ తారలు స్పందిస్తూ ఫన్నీ ట్వీట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తన ట్విట్టర్ ద్వారా.. హే ట్విట్టర్ బ్రదర్ వింటున్నావా? నేను సబ్‌స్క్రిప్షన్ కోసం డబ్బు చెల్లించాను. కాబట్టి నా బ్లూ టిక్ ని తిరిగి ఇవ్వండి. దాని వల్ల నేనే అమితాబ్ బచ్చన్ ని అని ప్రజలు తెలుసుకుంటారు. నేను మిమ్మల్ని చేతులు జోడించి మరీ అడుగుతున్నాను. లేకుంటే మీ కాళ్ల మీద కూడా పడమంటావా?” అంటూ ట్వీట్ చేశాడు.

Ugram Trailer : అల్లరి నరేష్ లోని ‘ఉగ్రం’ మాములుగా లేదు.. ట్రైలర్ రిలీజ్!

ఈ బ్లూ టిక్ పై మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ట్వీట్స్ చేశారు. “నా బ్లూ టిక్ ఎక్కడో పోయింది” అంటూ నిధి అగర్వాల్ ట్వీట్ చేస్తే, బాయ్ బాయ్ బ్లూ టిక్ అని మెహ్రీన్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా టాలీవుడ్ చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు బ్లూ టిక్ తొలిగిపోయింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగార్జున బ్లూ టిక్ ఇంకా అలానే ఉంది.

ట్రెండింగ్ వార్తలు