Ugram Trailer : అల్లరి నరేష్ లోని ‘ఉగ్రం’ మాములుగా లేదు.. ట్రైలర్ రిలీజ్!

నాంది సినిమాతో తనకి సూపర్ హిట్ అందించిన దర్శకుడితో అల్లరి నరేష్ కలిసి చేసిన మరో సినిమా ఉగ్రం. ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.

Ugram Trailer : అల్లరి నరేష్ లోని ‘ఉగ్రం’ మాములుగా లేదు.. ట్రైలర్ రిలీజ్!

Allari Naresh Mirnaa Menon Ugram Trailer released

Updated On : April 21, 2023 / 8:15 PM IST

Ugram Trailer : అల్లరి సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైన హీరో నరేష్ (Allari Naresh). మొదటి సినిమాలో తన అల్లరి అంత చూపించి ఆ మూవీ పేరునే తన ఇంటి పేరుగా చేసుకున్నాడు. కామెడీ సినిమాలతో టాలీవుడ్ మంచి ఫేమ్ ని సంపాదించుకున్న నరేష్.. 2021 లో నాంది (Naandhi) అనే సీరియస్ క్రైమ్ డ్రామా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తన కామెడీ జోనర్ ని పక్కన పెట్టి చేసిన ఈ సినిమా హిట్టు అవ్వడమే కాకుండా, కొంతకాలంగా హిట్టు లేక ఇబ్బంది పడుతున్న నరేష్ కూడా ఆనందాన్ని ఇచ్చింది.

Allari Naresh 61 : అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా కొత్త సినిమా.. మళ్ళీ పాత పంథాలోకి నరేశ్?

ఈ సినిమాలో తన యాక్టింగ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ తో అప్పటి నుంచి కామెడీ కథలకే కాకుండా ఇతర జోనర్ చిత్రాలను కూడా ఓకే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తాజాగా మరోసారి నాంది మూవీ డైరెక్టర్ తో కలిసి ఉగ్రం అనే సినిమాతో వస్తున్నాడు. వీరిద్దరి కలయికలో వచ్చిన నాంది సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూవీ పై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

 

తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో నరేష్ తనలోని ఉగ్రం మొత్తం చూపించనున్నాడు. ఈ మూవీలో అల్లరి నరేష్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. రాష్ట్రంలో మిస్ అవుతున్న ప్రజలను కనిపెట్టేందుకు నరేష్ ఫైట్ చేస్తుంటాడు. ఈ క్రమంలోని తన భార్య, పిల్ల కూడా కనిపించకుండా పోతుంది. చివరికి వాళ్ళని కనిపెట్టాడా? లేదా? అనేది మూవీ స్టోరీ అని తెలుస్తుంది. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మిర్నా మీనన్ (Mirnaa Menon) హీరోయిన్ గా నటిస్తుంది.