Amitabh Bachchan : అమితాబ్ బచ్చన్ ఇంట్లో విషాదం.. ఆమె మరణంతో..
ఇందిరా భాదురి మరణంతో అమితాబ్ ఇంట్లో విషాదం నెలకొంది.

Amitabh Bachchan Mother In Law Jaya Bachchan Mother Indira Bhaduri passes away
Amitabh Bachchan : బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో విషాదం నెలకొంది. అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ తల్లి ఇందిరా భాదురి కన్నుమూశారు. జయా బచ్చన్ తల్లి మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో నివాసం ఉంటారు. వయోభారంతో, పలు ఆరోగ్య సమయాలతో ఆమె గత కొన్నాళ్లుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స అందుకుంటూనే 94 ఏళ్ళ వయసులో నిన్న రాత్రి ఆమె కన్నుమూశారు. అయితే ఈ విషయం ఇవాళ ఉదయం తెలిపారు.
Also Read : Prabhas : ప్రభాస్ పుట్టిన రోజు.. కృష్ణంరాజు విగ్రహం వైరల్.. ప్రభాస్ పెద్దమ్మను కలిసిన హీరోయిన్..
జయా బచ్చన్ తల్లి ఇందిరా భాదురి మరణంతో అమితాబ్ ఇంట్లో విషాదం నెలకొంది. అమ్మమ్మ మరణవార్త విని అభిషేక్ బచ్చన్ ఇవాళ ఉదయం భోపాల్ కి వెళ్లగా ఆ తర్వాత అమితాబ్, మిగతా కుటుంబ సభ్యులు భోపాల్ వెళ్లారు. తల్లి మరణంతో జయాబచ్చన్ తీవ్ర విషాదంలో మునిగింది. దీంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు జయా బచ్చన్ తల్లికి నివాళులు అర్పిస్తున్నారు.