Google Mapsలో అమితాబ్ వాయిస్ ?

  • Publish Date - June 11, 2020 / 02:04 AM IST

ఎక్కడైనా తెలియని ప్రాంతానికి వెళ్లే సమయంలో Google Map ను ఆశ్రయిస్తుంటారు. కరెక్టుగా ఆ ప్రాంతానికి ఎలా వెళ్లాలి అనేది రైట్..లెఫ్ట్ అంటూ మ్యాప్ లో ఓ వాయిస్ వినిపిస్తుంటుంది. కానీ త్వరలోనే..బాలీవుడ్ Big B అమితాబ్ బచ్చన్ వాయిస్ ఇనే అవకాశం ఉందని తెలుస్తోంది. తన గంభీర స్వరంతో Take Right, Take Left అంటూ దిశ..నిర్దేశం చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అన్నీ కుదిరితే..త్వరలోనే…ఇది నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు Google Map ఇండియా బృందం..అమితాబ్ తో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. 

అరుదైన పర్సనాలిటిస్ బిగ్ బి అమితాబ్ బచ్చన్..ఒకరుగా చెప్పవచ్చు. గర్వించగల నటుల్లో అమితాబ్ పేరు ఎప్పుడు ముందువరుసలో ఉంటుంది. మొదటగా ఆయన గొంతు బాగాలేదని చెప్పిన వారే..ఇప్పుడు గొంతు అరువు ఇవ్వాలని కోరుతున్నారు. గంభీరమైన స్వరంతో ఉండే ఆయన మాటలు అందర్నీ ఆకర్షిస్తుంటాయి. పలు కంపెనీలు తమ ప్రచారం కోసం ఆయన వాయిస్ ని వాడుకుంటుంటారు.

తాజాగా…ఇందులో Google Map కూడా చేరనుందని సమాచారం. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ తో చర్చలు జరుపుతున్నారు. ఇందుకు భారీ మొత్తంలో ఆఫర్ ఇస్తున్నారని టాక్. కానీ దీనిపై అమితాబ్ ఇంకా స్పందించలేదు. ఆయన ఒకే చెబితే గూగుల్ వెంటనే ఆయన వాయిస్ ని రికార్డు చేసి దాన్ని మ్యాప్స్ లోని Navigation కు ఉపయోగిస్తుంది. ఇరువర్గాల మధ్య చర్చలు జరుపుతుండగా..త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పలు వీడియోలకు వాయిస్ ఓవర్ గా అరువిచ్చి సూపర్బ్ అనిపించారు. మరి..Google Mapకు ఆయన Voice అందిస్తారో లేదో చూడాలి. 

Read: మాస్క్ లేకపోతే..కరోనా రావడం పక్కా అంట

ట్రెండింగ్ వార్తలు