Amma naku aa abbai kavali movie officially started
Amma.. Naku Aa Abbai Aavali: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో లేడీ ప్రొడ్యూసర్ అరంగేట్రం చేస్తున్నారు. ఆమె మరెవరో కాదు ప్రముఖ వ్యాపారవేత్త ‘జి. శైలజా రెడ్డి’. తాజాగా ఈ బ్యానర్ లో కొత్త సినిమాను స్టార్ట్ చేశారు. అదే ‘అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి(Amma.. Naku Aa Abbai Aavali)’. జి.ఎస్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై వస్తున్న ఈ సినిమాను సీనియర్ దర్శకుడు శివాల ప్రభాకర్ తెరకెక్కిస్తుండగా.. పవన్ మహావీర్ హీరోగా పరిచయమవుతున్నాడు. సుహాన, మేఘశ్రీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో సుమన్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఘనంగా జరిగింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్ క్లాప్ ఇచ్చారు. నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించగా.. సీనియర్ ఐ.పి.ఎస్. అధికారి ఘట్టమనేని శ్రీనివాస్ కెమెరా స్విచాన్ చేశారు. ఇంకా కార్యక్రమంలో దర్శకులు రేలంగి నరసింహారావు, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, శోభారాణి, రచయిత జె.కె.భారవి తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సినిమాకు ఎల్.ఎన్.ఆర్, జి.సాయిపద్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తుండగా.. పి.ఆర్.ఓ గా ధీరజ్ – అప్పాజీ, ప్రొడక్షన్ మేనేజర్ గా బాలరాజు, కో-డైరెక్టర్ గా రావుశ్రీ ఉన్నారు.