భయపడి బిలియనీర్ అవుతాడా.. తొందరపడి బెగ్గర్ అవుతాడా? రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్..

ఈ ఉగాదికి zee5 తమ ప్రేక్షకులందరికీ ‘అమృతం ద్వితీయం’ ద్వారా షడ్రుచుల అమృతాన్ని వడ్డించబోతుంది..

  • Published By: sekhar ,Published On : March 12, 2020 / 01:44 PM IST
భయపడి బిలియనీర్ అవుతాడా.. తొందరపడి బెగ్గర్ అవుతాడా? రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్..

Updated On : March 12, 2020 / 1:44 PM IST

ఈ ఉగాదికి zee5 తమ ప్రేక్షకులందరికీ ‘అమృతం ద్వితీయం’ ద్వారా షడ్రుచుల అమృతాన్ని వడ్డించబోతుంది..

బుల్లితెరపై సంచలనం సృష్టించిన ‘అమృతం’ తెలుగు ప్రేక్షకులను మరింతగా అలరించడానికి మళ్లీ రానుంది. zee5 మరియు Lightbox Media అధినేత గుణ్ణం గంగరాజు కలిసి ‘అమృతం ద్వితీయం’ (అద్వితీయం) నిర్మిస్తున్నారు. (మూర్ఖత్వానికి మరణం రాదు) అనే ఫన్నీ ట్యాగ్ లైన్ పెట్టారు.

తాజాగా ‘అమృతం ద్వితీయం’ ట్రైలర్ దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ‘అమృతం’ క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ట్వీట్ చేశారు రాజమౌళి. ఈ జెనరేషన్‌కు తగ్గట్టు చక్కటి కథా కథనాలతో, అదిరిపోయే కామెడీతో ‘అమృతం ద్వితీయం’ తెరకెక్కుతోంది. ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది.

హర్షవర్ధన్, శివన్నారాయణ, వాసు ఇంటూరి, రాగిణి పూర్వ పాత్రలే పోషించగా, L.B శ్రీరామ్ అంజి పాత్రలో, సత్య క్రిష్ణ అమృతం భార్య సంజీవిని పాత్రలో కనబడనున్నారు. కాశీ విశ్వనాథ్ మరియు రాఘవ కీలకమైన పాత్రలు పోషించారు. ఉగాది కానుకగా మార్చి 25 నుంచి zee5 లో ‘అమృతం ద్వితీయం’ ప్రసారం కానుంది..