అతిథి కదా అని రానిస్తే..

Anaganaga O Athidhi: కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్, సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘ఆహా’ లో మరో వైవిధ్యభరితమైన మూవీ రాబోతుంది. ‘ఆర్‌ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ నటీనటులుగా దయాల్ పద్మనాభన్ తెరకెక్కించిన పీరియాడిక్ థ్రిల్లర్.. ‘అనగనగా ఓ అతిథి’. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి విడుదల చేశారు. ఈ చిత్రం నవంబర్ 13న ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇదొక పీరియాడికల్ మూవీ. కన్నడ చిత్రపరిశ్రమలో అవార్డ్ విన్నింగ్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు దయాల్ పద్మనాభన్ తెలుగులో డైరెక్ట్ చేస్తున్న తొలి చిత్రమిది. పేదరికంలో నివస్తున్న ఓ కటుంబంలోకి ఓ అతిథి వస్తాడు. అతని రాకను వారు అదృష్టంగా భావిస్తే వారికి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. దురాశ, కామం, అత్యాశ వంటి ఎలిమెంట్స్‌ను సూచించేలా ఇందులో పాత్రలు ఉంటాయని మూవీ టీమ్ తెలిపింది. ఈ చిత్రానికి అరోల్ కొరెల్లి సంగీతమందించారు.