Anaganaga Oka Raju movie collected 100 crore gross at box office
Anaganaga Oka Raju Collection: టాలీవుడ్ స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’. కొత్త దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. యునానిమస్ పాజిటీవ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు.
Vygha Reddy: పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసేవాళ్ళు వేస్ట్ ఫెలోస్.. దిల్ రాజు భార్య కామెంట్స్ వైరల్
దీంతో కలెక్షన్స్(Anaganaga Oka Raju Collection) కూడా అదే రేంజ్ లో రాబడుతోంది ఈ మూవీ. మొదటి రోజు రూ.20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు మొదటిరోజు కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. రెండు రోజులు కలుపుకొని ఏకంగా రూ.41 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది.
ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో, నేవీన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అనగనగా ఒక రాజు సినిమా. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉండాలి ట్రేడ్ వర్గాలు చేస్తున్నాయి. అలాగే ఈ సినిమా కొనుకున్న బయ్యర్లు అందరు ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లారు. ఓపక్క మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ అనగనగా ఒక రాజు సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అంటే మాములు విషయం కాదు.