Vygha Reddy: పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసేవాళ్ళు వేస్ట్ ఫెలోస్.. దిల్ రాజు భార్య కామెంట్స్ వైరల్

దిల్ రాజు భార్య వైఘా రెడ్డి(Vygha Reddy) పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Vygha Reddy: పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసేవాళ్ళు వేస్ట్ ఫెలోస్.. దిల్ రాజు భార్య కామెంట్స్ వైరల్

Dil Raju wife Vygha Reddy interesting comments about Pawan Kalyan.

Updated On : January 19, 2026 / 12:23 PM IST
  • పవన్ కళ్యాణ్ దిల్ సే మాట్లాడతారు
  • అందుకే ఆయనంటే చాలా మంది ఇష్టపడతారు
  • దిల్ రాజు భార్య వైఘా రెడ్డి కామెంట్స్ వైరల్

Vygha Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నిర్మాతగా ఉన్నారు దిల్ రాజు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అందులో ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుంది అనే రేంజ్ లో ఫేమ్ తెచ్చుకున్నారు దిల్ రాజు. ఇక దిల్ రాజుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనతో పదేళ్ల నుంచి సినిమా చేద్దాం అని ప్లాన్ చేసి ఫైనల్ గా వకీల్ సాబ్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

అయితే, ఆయనకే కాదు దిల్ రాజు భార్య వైఘా రెడ్డికి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చాలాసార్లు చెప్పుకొచ్చింది. అయితే, తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది వైఘా రెడ్డి(Vygha Reddy). రీసెంట్ గా ఆమె ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొంది. ఈ పాడ్ కాస్ట్ లో యాంకర్ పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో వచ్చే నెగిటీవ్ కామెంట్స్ గురించి, ఆయనపై జరిగే ట్రోలింగ్ కూడా అడిగింది.

Aakasamlo OKa Tara: ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్ ఎంట్రీ.. సరికొత్తగా గ్లింప్స్‌!

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పై జరిగిన బాడీ షేమింగ్ గురించి కూడా అడిగింది. దానికి సమాధానంగా వైఘా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసేవాళ్ళు వేస్ట్ ఫెలోస్ అంటూ చెప్పుకొచ్చింది. ‘ఆయన పొలిటికల్ గా ఎంతో కష్ట పడుతున్నారు. జనాలతో నడవడం, రోడ్స్ పై పడుకోవడం ఇవన్నీ చూస్తూ కూడా అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు వేస్ట్ ఫెలోస్. ఆయన ఏది మాట్లాడిన దిల్ సే మాట్లాడతారు. అందుకే ఆయన్ని చాలా మంది ఇష్టపడతారు.

నేను కూడా. ఆయనకు డబ్బు మీద వ్యామోహం లేదు. అందుకే సినిమా నుంచి రాజకీయాలలోకి వచ్చి సేవ చేస్తున్నారు. ఆయనలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. కోపంగా మాట్లాడతారు, అరుస్తారు, ఊగిపోతారు, కొన్నిసార్లు ఎమోషన్ అవుతారు. అవన్నీ ఆయన హృదయం నుంచి వచ్చిన ఎమోషన్స్. అలా కాదు, ఒక స్పీచ్ ఇవ్వాలని కూర్చుంటే అన్ని ఎమోషన్స్ రావు కదా. అందుకే పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్’ అంటూ చెప్పుకొచ్చింది వైఘా రెడ్డి.

ఇంకా ఆమె పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమా నెక్స్ట్ లెవల్ అంటూ చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్, ఎమోషన్స్, ట్విస్టులు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పింది. దీంతో పవన్ కళ్యాణ్ పై వైఘా రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.